విజయ్ లియోలో RRR కాన్సెప్ట్?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియో టీమ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అర్ధరాత్రి ముహూర్తం ఫిక్స్ చేయడంతో కేవలం ఈ పోస్టర్ కోసమే ఫ్యాన్స్ మేలుకుని మరీ ఎదురు చూశారు. చెన్నై రోహిణి థియేటర్ లో ప్రత్యేక సెలబ్రేషన్స్ చేసి పోకిరి స్పెషల్ షో కూడా వేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు మాములుగా లేవు. కమల్ హాసన్ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూవీ కనక సహజంగానే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. దసరా పండగను లక్ష్యంగా చేసుకున్న లియో మూడు వందల కోట్లకు పైగానే డీల్స్ చేస్తోంది.

ఇదిలా ఉండగా ఇందులో విజయ్ పాత్రకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బయటికి వస్తున్నాయి. వాటి ప్రకారం ఇది ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ కు దగ్గరగా ఉంటుందట. అంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఎలాగైతే నీరు నిప్పుకు ప్రతినిథులుగా రాజమౌళి చూపించాడో ఇందులో కూడా విజయ్ క్యారెక్టర్ అలాంటి రెండు షేడ్స్ ఇందులో కలిగి ఉంటుందట. అయితే ఇది డ్యూయల్ రోలా లేక ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి వర్తమానంలో మరొకటి ఉంటుందా అనే లీక్ అయితే ప్రస్తుతానికి లేదు మాస్టర్, విక్రమ్, కార్తీ లాగే లోకేష్ దీంట్లో కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ పెట్టాడు

లియోలో ఎవరైనా ప్యాన్ ఇండియా స్టార్ తో క్యామియో చేయించాలని లోకేష్ విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. రామ్ చరణ్ ని అడిగినట్టు టాక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో ఇంకో రెండు మూడు నెలలు ఆగితే కానీ క్లారిటీ రాదు. యష్ ని సంప్రదించినప్పటికీ స్పందన రాలేదట. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న లియోలో త్రిష హీరోయిన్ కాగా తేరి తరహాలో ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య సెంటిమెంట్ మెయిన్ పాయింట్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ ఈసారి ఊహలకు మించి ఏదో చేయబోతున్నాడన్న మాట