Movie News

ఘరానా కలయిక మూడు దశాబ్దాల తర్వాత

కొందరు హీరోల సంగీత దర్శకుల కాంబినేషన్లు భలే కుదురుతాయి. ఒకటి రెండు హిట్లు పడగానే కొన్ని సంవత్సరాల పాటు అలాగే కొనసాగిస్తారు. ఇళయరాజా, రెహమాన్ లకు ఇలాంటి కలయికలు చాలానే ఉన్నాయి. అయితే ఎంఎం కీరవాణి – చిరంజీవికి మాత్రం ఎందుకో ఎక్కువసార్లు కాంబో రాలేదు. వీళ్లిద్దరి ఫస్ట్ కాంబినేషన్ ఘరానా మొగుడు. ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ బ్లాక్ బస్టర్ అప్పట్లో మ్యూజికల్ గానూ పెద్ద సెన్సేషన్. దీని తర్వాతే కీరవాణికి మాస్ ఎంటర్ టైనర్లు క్యూ కట్టాయి. ఆపద్బాంధవుడు ఆల్బమ్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంది కానీ కమర్షియల్ ఫలితం డిజాస్టర్

చివరిసారి చేతులు కలిపింది 1994లో వచ్చిన ఎస్పి పరశురాంతో. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. పాటలు కూడా సోసోగానే వెళ్లాయి. ఆ తర్వాత మెగాస్టార్ పూర్తిగా కోటి, మణిశర్మల వైపు షిఫ్ట్ అయిపోవడంతో తిరిగి ఇంకో సినిమా కుదరలేదు. తిరిగి ఇప్పుడు  చిరు కోసం కీరవాణి సంగీతం ఇవ్వబోతున్నారని టాక్. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే ఫాంటసీ సబ్జెక్టుకి ఆయనైతే న్యాయం చేయగలరని భావించి ఆ మేరకు ఫైనల్ చేసినట్టు వినికిడి. అఫీషియల్ ప్రకటన రావటానికి టైం పట్టొచ్చు.

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిపోయిన కీరవాణితో అంటే చిరంజీవి నో అని ఎలా అంటారు. పైగా ఇంత గ్యాప్ తర్వాత అంటే ఖచ్చితంగా అంచనాలతో పాటు అవుట్ ఫుట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ముల్లోక వీరుడు టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ని భోళా శంకర్ రిలీజయ్యాక ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా వెల్లడించే అవకాశాలున్నాయి. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన మూవీతో పాటు దీన్ని సమాంతరంగా షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తారట. రెండూ వచ్చే ఏడాది రిలీజయ్యేలా సెట్ చేసుకుంటున్నారు 

This post was last modified on June 19, 2023 5:53 pm

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

29 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago