వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ద్వారంపూడికి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన తాతయ్యకు అప్పటి జిల్లా ఎస్పీ డీటీ నాయక్ బేడీలు వేసి తీసుకువెళ్లారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ద్వారంపూడి మండిపడ్డారు. తన తాతకు బేడీలు వేసి తీసుకువెళ్ళలేదని క్లారిటీనిచ్చారు. కానీ, అదే కాకినాడలో పవన్ చేతికి బేడీలు వేసి కొట్టించగలరని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన చేతికి బేడీలు వేయడం పవన్ జన్మలో సాధ్యం కాదని అన్నారు. నీ సంగతి చూస్తానని, దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని పవన్ కు ద్వారంపూడి చాలెంజ్ చేశారు. చంద్రబాబును దేహి అని అడుక్కుంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ కు సీట్ ఇస్తే పోటీ చేయాలని సవాల్ విసిరారు. రెడ్డి సామాజిక వర్గాన్ని పవన్ ద్వేషిస్తున్నారని ఆరోపించారు. తాను రౌడీ, కబ్జాకోరు అయితే జనం గెలిపిస్తారా అని ప్రశ్నించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని, ప్యాకేజీ కుదరకపోవడంతోనే వారాహి యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం చేయాలని కోరుతున్నారని, కానీ, కొద్ది రోజుల క్రితం తనకు సీఎం పదవి అడిగే అర్హత లేదని పవన్ చెప్పారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను అంటూనే పూనమ్ కౌర్, రేణు దేశాయ్ లపై ద్వారంపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ గురించి వారిద్దరూ బయటికి వచ్చి మాట్లాడుతామంటున్నారని అన్నారు. పవన్ డ్రగ్స్ వాడతారని అందరికీ తెలుసని, కానీ, ఆ విషయంలో తనకు క్లారిటీ లేదని అన్నారు. తాను కాకినాడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, పవన్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారా? అని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు.
జనసేన చంద్రబాబు కోసం పనిచేస్తుందో రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో చెప్పాలని నిలదీశారు. తాను మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచానని, పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని, తనను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. కాకినాడలో 50 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, అన్ని సామాజిక వర్గాల ప్రజల నుంచి తనకు మద్దతు ఉంది కాబట్టే ఎన్నికలలో రెండుసార్లు గెలిచానని ద్వారంపూడి అన్నారు. పవన్ కు పరిటాల రవి గుండు కొట్టిచ్చారని, సీఎం కావాలన్న పవన్ కోరిక సినిమాలోనే తీరుతుందని చెప్పారు.
This post was last modified on June 19, 2023 4:26 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…