Movie News

14 ఏళ్ళ తర్వాత పోలీస్ గోపీచంద్

ఇటీవలే రామబాణంతో చేదు ఫలితాన్ని అందుకున్న మెచో స్టార్ గోపీచంద్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏ కాంబినేషన్ తనకు వర్కౌట్ కావడం లేదు. రొటీన్ కథలు వద్దని ఫలితాలు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా కమర్షియల్ జానర్ ని వదలకుండా  హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఈసారి గేరు మార్చినట్టే కనిపిస్తోంది. కన్నడ దర్శకుడు ఏ హర్షతో చేస్తున్న సినిమాకి భీమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న గోపీచంద్ ఎక్స్ ప్రెషన్ తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

స్క్రీన్ మీద గోపీచంద్ ఖాకీ చొక్కా తొడిగి పద్నాలుగు సంవత్సరాలయ్యింది. చివరిసారి 2010 పూరి గోలీమార్ లో గంగారాంగా చూపించిన విశ్వరూపం అందరికీ గుర్తే. అంతకు ముందు శౌర్యం, ఆంధ్రుడులో కూడా ఈ తరహా పాత్రలు చేశాడు. అయితే ఇవన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా తీవ్రంగా నిరాశపరిచినవి కావు. అందుకే భీమా మీద ఆ కోణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక దర్శకుడు హర్ష విషయానికి వస్తే ఇతను మామూలోడు కాదు. బాలయ్య శివరాజ్ కుమార్ కాంబో ప్రాజెక్టు ఇతనే చేయబోతున్నాడు. మూడు భాగాల సిరీస్ లో రజనీకాంత్ నటించే అవకాశం కూడా ఉంది  

ఇతని ట్రాక్ రికార్డు చూస్తే డార్క్ టోన్ లో స్టైలిష్ కం ఫాంటసీ ఎంటర్ టైనర్లు బాగా తీస్తాడు. భజరంగి రెండు భాగాలు దానికి మంచి ఉదాహరణ. వేద ఇక్కడ ఆడలేదు కానీ శాండల్ వుడ్ లో రెవిన్యూ పరంగా బాగా పే చేసింది. రారండోయ్ వేడుక చూద్దాం. విశాల్ పూజలను కన్నడ లో రీమేక్ చేసుకుని హిట్లు కొట్టాడు. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్ర అనే సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు. సో భీమా మీద నమ్మకం పెట్టుకోవచ్చనే వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న గోపీచంద్ ఈసారి పోలీస్ దుస్తుల్లో ఏం రచ్చ చేయబోతున్నాడో 

This post was last modified on June 12, 2023 1:02 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

1 hour ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

2 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

2 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

3 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago