టాలీవుడ్లో ఇప్పుడు ఫ్యాన్ వార్స్ తీరే మారిపోయింది. ఒకప్పుడు వంద రోజుల సెంటర్లు.. ఆపై కలెక్షన్ల లెక్కల మీద కొట్టేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లకు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ట్వీట్లే యుద్ధాలకు ఆయుధాలుగా మారిపోయాయి. వీటన్నింట్లోకి కొత్త ట్రెండ్ అంటే.. తమ హీరోల పుట్టిన రోజుల్ని పురస్కరించుకుని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేయడమే. మిలియన్లకు మిలియన్ల ట్వీట్లు అలవోకగా వేసేస్తూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు అభిమానులు.
తాజాగా మహేష్ అభిమానులు తమ ఆరాధ్య నటుడి పుట్టిన రోజును పురస్కరించుకుని 24 గంటల వ్యవధిలో ఏకంగా 60 మిలియన్ ట్వీట్లు వేసిన చరిత్ర సృష్టించారు. ఇది వరల్డ్ రికార్డ్ అని అంటున్నారు.
ఐతే ఆఫ్ లైన్ అయినా.. ఆన్ లైన్ అయినా ఫాలోయింగ్ విషయంలో మెగా హీరోలు ఎవరికీ తీసిపోరు. రికార్డులు నెలకొల్పడంలో, బద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మహేష్ అభిమానులు నెలకొల్పిన రికార్డు వాళ్లకు కొత్త టార్గెట్ అయింది.
ఈ మధ్య సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండు మీదే ఏకంగా 28 మిలియన్ ట్వీట్లు వేసిన ఘనత వాళ్లది. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ 60 మిలియన్లు కొట్టిన నేపథ్యంలో దాన్ని కొట్టడమే కాదు.. కొత్త శిఖరాల్ని అందుకోవాలన్నది పవన్ ఫ్యాన్స్ ఆకాంక్ష. ఇందుకోసం ఏకంగా 100 మిలియన్ ట్వీట్లను టార్గెట్‌గా పెట్టేసుకున్నారు. పవన్ పుట్టిన రోజు కంటే ముందు చిరంజీవి బర్త్ డే రాబోతోంది ఆగస్టు 22న. ఆ రోజు కూడా ట్విట్టర్ సందడి ఓ రేంజిలో ఉండే అవకాశముంది.
ఓవరాల్‌గా మెగా ఫ్యాన్స్ కలిసి 100 మిలియన్ ట్వీట్ల కోసం ట్రై చేసే అవకాశాలున్నాయి. అప్పుడు సాధ్య పడ్డా పడకపోయినా.. పవన్ పుట్టిన రోజుకు మాత్రం 100 మిలియన్ ట్వీట్లు వేయాలన్న టార్గెట్ పెట్టుకుని రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on August 10, 2020 3:34 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…