యాక్టర్స్ సినిమాళ్లో ఎమోషన్ కి తగ్గట్టుగా ఏడవటం సహజమే. అదే బయట ఒక యాక్టర్ కన్నీరు పెడితే అది హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా సిద్దార్థ్ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే .. సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా కొన్ని రోజులుగా తెలుగు , తమిళ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా సిద్దు ఓ తమిళ సంస్థ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సంస్థ సిద్దార్థ్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా సిద్దార్థ్ ను శంకర్ కి నటుడిగా పరిచయం చేసిన సుజాత గారిని పిలిపించి సిద్దు కి సర్పయిజ్ ఇచ్చారు.
సుజాత గారిని చూడగానే సిద్దు ఎమోషనల్ అవుతూ ఆమె కాళ్ళపై పడిపోయి కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె లేకపోతే ఈ ఇరవై ఏళ్లు ఇలా ఉండేవి కాదని చెప్తూ భావోద్వేగం చెందాడు. ఇక అనంతరం సుజాత సిద్దు గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. స్క్రీన్ రైటర్ సుజాత రంగరాజన్ భార్య అయిన సుజాత సిద్దార్థ్ లో ఉన్న నటుడిని గుర్తించి శంకర్ కి రిఫర్ చేయమని చెప్పారట. కానీ రంగరాజన్ అందుకు ఒప్పుకోలేదని సిద్దు డైరెక్టర్ అవుతాడని ఆయన నిరాకరిస్తే ఆమె స్వయంగా శంకర్ తో మాట్లాడి సిద్దార్థ్ ను బాయ్స్ సినిమాకి రిఫర్ చేశారట. మొదట సిద్దు బాయ్స్ ఆఫర్ ను ఒప్పుకోలేదని , ఆ సమయంలో మణిరత్నం బలవంతంగా చెప్పి ఒప్పించారని ఆమె పేర్కొంది.
ఇదంతా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న ప్రేక్షకులు సిద్దు ఆమె పై చూపించిన గ్రాటిట్యూడ్ కి మెచ్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ కన్నీరు పెట్టుకున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.
This post was last modified on June 8, 2023 7:07 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…