పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రాధాన్యత క్రమంలో మూడు సినిమాలున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తర్వాత బ్రో. చివరిదే మొదట విడుదలవుతున్నా కంటెంట్ పరంగా అది రీమేక్ కావడం, కమర్షియల్ అంశాలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం లేకపోవడం వల్ల సుజిత్, హరీష్ శంకర్ లకు ప్లస్ అవుతోంది. అయితే వీటికన్నా ముందు మొదలైన పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు మీద బజ్ దాదాపుగా జీరోకు వచ్చేసింది. అప్డేట్స్ ఇవ్వడం ఆపేసిన నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ లు అడుగుదామన్నా బయట కనిపించడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లుకి లాంగ్ వెయిటింగ్ తప్పదు . ఎందుకంటే పవన్ ఈ నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నాడు. రాజకీయంగా యాక్టివ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎన్నికలు కాస్త ముందుగానే జరిగేలా ఉన్నాయి. అదే నిజమైతే పొత్తులు కన్ఫర్మ్ చేసుకుని ఎలక్షన్ క్యాంపైన్ కి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. జనసేన తరఫున జనానికి కనిపించాల్సిన ఫ్రంట్ ఇమేజ్ తానే కావడంతో షూటింగులతో పొలిటికల్ ఎఫైర్స్ బ్యాలన్స్ చేయడం కష్టం. బ్రో ఎలాగూ అయిపోయింది. మిగిలిన వాటిలో ముందు ఓజి పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు.
టైం ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు దొరుకుతాయి. ఇక హరిహర వీరమల్లు కోసం పవన్ తిరిగి హెయిర్ స్టైల్ ని పెంచాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన షెడ్యూల్స్ లో సహజమైన జుట్టుతో నటించాడు కాబట్టి ఇప్పుడు విగ్గు వాడితే బాగుండదు. అందుకే లేట్ అయినా సరే పనులన్నీ పూర్తి చేసుకుని అప్పుడు తిరిగి వీరమల్లు లుక్ లోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగిందంటే మాత్రం మళ్ళీ బ్రేక్ తప్పదు. ఎంత విపరీతమైన జాప్యం అవుతున్నా ఏఎం రత్నంకు ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. మధ్యలో అగ్నిప్రమాదం లాంటి దుర్ఘటనలు గాయం మీద కారం చల్లుతున్నాయి
This post was last modified on June 4, 2023 4:13 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…