టాలీవుడ్లో చాలా ఏళ్లుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడిగా ఉన్నాడు రానా దగ్గుబాటి. ఐతే ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా.. ఇప్పుడిప్పుడే అందుకు అవకాశమే లేదన్నట్లుగా మాట్లాడేవాడు. పెళ్లి గురించి కామెడీ చేసేవాడు. నేనా పెళ్లా అన్నట్లుగా పంచులు వేసేవాడు. అలాంటి వాడు తన బాహుబలి మిత్రుడు ప్రభాస్‌ను ఒంటరివాడిని చేసి పెళ్లి పీటలు ఎక్కేశాడు. తాను ఎంగేజ్ అయిన విషయాన్ని రెండు నెలల కిందటే వెల్లడించిన రానా.. లాక్ డౌన్ అని కూడా చూడకుండా పెళ్లాడేశాడు. శనివారమే అతడి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితులు,పరిమిత సంఖ్యలో హాజరైన బంధువులు, మిత్రుల మధ్య జరిగింది.
ఐతే నేరుగా పెళ్లికి హాజరు కాలేకపోయిన అందరికీ వర్చువల్ రియాలిటీ ద్వారా తన పెళ్లి చూసే అవకాశం కల్పించాడు రానా. ఇందుకోసం వీఆర్ సెట్లు కూడా పంపించాడు. ఒకప్పుడు బాహుబలి సినిమాలోని మహిష్మతి రాజ్యానికి సంబంధించిన దృశ్యాలు చూసేందుకు ఇలాంటి ఏర్పాట్లే చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్గంలో రానా పెళ్లిని చూసిన టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ట్విట్టర్లో ఆసక్తికర రీతిలో స్పందిస్తున్నారు. ఐకానిక్ బ్యాచిలర్ ముగింపును చూస్తున్నానంటూ.. వీఆర్‌లో రానా పెళ్లిని చూస్తున్న ఫొటోను నాని షేర్ చేశాడు. మరోవైపు నవదీప్ రానా పెళ్లిపై స్పందిస్తూ.. కనీ వినీ ఎరుగని రోజుకు శుభాకాంక్షలు మిత్రమా అని రానాను ట్యాగ్ చేశాడు. మరోవైపు రానా బాలీవుడ్ మూవీ బేబీ కో యాక్టర్ అక్షయ్ కుమార్ సైతం అతడి పెళ్లిపై సరదాగా స్పందించాడు. జీవితంలో శాశ్వతంగా లాక్ డౌన్ కావడానికి ఇదే మార్గం అని అతను కామెంట్ చేశాడు.
This post was last modified on August 8, 2020 9:10 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…