మిర్చియార్డ్ లో మాస్ స్ట్రైక్ 

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమాకు సంబందించి టైటిల్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు 31 న రివీల్ చేస్తూ ఓ మాస్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ ఖరారు చేశారు. ముందుగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ అనుకున్నారు కానీ ఫైనల్ గా మహేష్ , త్రివిక్రమ్ ఇద్దరూ మాస్ టైటిల్ కి ఓటేశారు. 

ఆ మధ్య టైటిల్ లేకుండా మిర్చి యార్డ్ లో మహేష్ నడుస్తూ వస్తున్న స్టైల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిందే. ఇప్పుడు ఆ యాక్షన్ ఎపిసోడ్ తోనే మాస్ స్ట్రైక్ పేరుతో టీజర్ రిలీజ్ చేసి టైటిల్ ప్రకటించనున్నారని సమాచారం. గుంటూరు మిర్చి యార్డ్ లో మాస్ యాక్షన్ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ ను మెప్పించేలా టీజర్ కట్ రెడీ చేశారట. ఇందులో మహేష్ ఫైట్ తో పాటు ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. 

మొత్తంగా ఈ టీజర్ స్ట్రైక్  అంతా మాస్ తో నింపేశారట. టీజర్ చూశాక ఫ్యాన్స్ కి మహేష్ నటించిన మాస్ బ్లాక్ బస్టర్ ‘ఒక్కడు’ గుర్తుకురావడం పక్కా అంటున్నారు యూనిట్. మహేష్ బాబు ఎన్ని కమర్షియల్ మాస్ సినిమాలు చేసినా ‘ఒక్కడు’ రేంజ్ మాస్ సినిమా మాత్రం పడలేదు. గుంటూరు కారంతో ఆ రేంజ్ మాస్ సినిమా డెలివరీ చేయాలని త్రివిక్రమ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. 

‘అరవింద సమెత వీర రాఘవ’తో ఎన్టీఆర్ ను మరింత మాస్ గా చూపిస్తూ సినిమా ఆరంభంలో యాక్షన్ ఎపిసోడ్ పెట్టినట్టు ఇందులో కూడా త్రివిక్రమ్ చాలా మాస్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నాడని టాక్. ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ తో మహేష్ మిర్చి యార్డ్ లో చేసే ఫైట్ సోషల్ మీడియాని షేక్ చేయడం ఖాయమనిపిస్తుంది. కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు సినిమాతో పాటు గుంటూరు కారం టైటిల్ టీజర్ ను థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.