Movie News

ఈ క్లారిటీ కోసం సినిమా తీయాలా?

సీనియర్ నటుడు నరేష్ హీరోగా ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ నటుల సినిమాలకే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న రోజుల్లో ఆయన హీరోగా సినిమా తీస్తే ఆడియన్స్ కనీసం పట్టించుకుంటారా అనిపిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ముడిపడ్డ సంఘటనలనే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో పెట్టడం.. తన నిజ జీవిత భాగస్వామి పవిత్ర లోకేష్‌నే తనకు జోడీగా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు నరేష్.

అగ్రెసివ్ ప్రమోషన్లతో ఈ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేసి.. తొలి రోజు ఓ మోస్తరుగా థియేటర్లు నిండేలా చేయగలిగారు. ఐతే ప్రమోషన్లలో నరేష్‌తో పాటు టీంలో ఎవ్వరిని అడిగినా ఇది నిజ జీవిత కథ కాదు అనే చెప్పారు. ఇది ఫిక్షనల్ స్టోరీ అని.. అందరూ కనెక్టవుతారని… సెన్సేషనల్ విషయాలు ఉంటాయని.. ఇంకా చాలా మాటలే చెప్పారు.

తీరా చూస్తే సినిమాలో అవేవీ లేవు. కేవలం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల గురించి క్లారిటీ ఇవ్వడానికి.. తాను ఉత్తముడినని చెప్పడానికి నరేష్ ఈ సినిమా తీసినట్లు అనిపించింది. నరేష్‌కు, ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి అసలు గొడవేంటి.. పవిత్ర లోకేష్‌తో ఈయన బంధం ఎలా మొదలైంది అనే విషయాల్లో జనాలకు కొన్ని సందేహాలు, కొంత క్యూరియాసిటీ ఉన్న మాట వాస్తవం.

వీటికి బదులివ్వాలని అనుకుంటే నరేష్ ఒక పర్సనల్, బోల్డ్ ఇంటర్వ్యూ ఇస్తే సరిపోయేది. మొత్తం ఏం చెప్పాలనుకున్నారో అదంతా చెబితే పోయేది. ఒక సెన్సేషనల్ ప్రోమో కట్ చేస్తే ఆటోమేటిగ్గా జనాలు ఆ ఇంటర్వ్యూ చూసేస్తారు. కానీ నరేష్ మాత్రం ఆ మార్గాన్ని వదిలేసి.. కోట్లు ఖర్చు పెట్గి ఎం.ఎస్.రాజుతో ఒక సినిమానే తీయించేశారు.

ఈ సినిమా చూస్తే మరీ ఏకపక్షంగా.. నరేష్, పవిత్రలను ఉత్తమోత్తములుగా చూపిస్తూ.. వాళ్ల మాజీ భాగస్వాములు పరమ నీచులు అనేలా చిత్రీకరించారు. వాళ్లలో చెడు లక్షణాలు ఉండొచ్చు కానీ.. మరీ ఇంత ఏకపక్షంగా, మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం. వీళ్లు చాలా మంచి వాళ్లు… తప్పంతా వాళ్లదే అనడం మాత్రం అన్యాయంగానే అనిపిస్తుంది. నరేష్‌కు డబ్బుంది కాబట్టి ఈ సినిమా తీశారు.. మరి అవతలి వాళ్లు తమ వెర్షన్ ఎలా వినిపించాలి? వాళ్లకూ డబ్బుంటే అదే పని చేసేవారేమో.

This post was last modified on May 27, 2023 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

10 hours ago