సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 28కు సంబంధించిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. వాటిలో మొదటిది తమన్ పేరు పోస్టర్లో లేకపోవడం. నిన్న ఇవాళ వదిలిన టైటిల్ టీజర్ తాలూకు ప్రీ లుక్స్ లో ఎక్కడా తన పేరు లేదు. నిర్మాత చినబాబుతో పాటు డైరెక్టర్ ని హైలైట్ చేశారు తప్పించి సాధారణంగా ఎక్కడో ఒకచోట ఉండాల్సిన ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ అనే ట్యాగ్ మాయమయ్యింది. అంటే ఉద్దేశపూర్వకంగానే తొలగించారన్నది ఫ్యాన్స్ అనుమానం. ఎల్లుండి వచ్చే టీజర్ లో మాత్రం తన బిజిఎం ఉంటుంది
ఇన్ సైడ్ టాక్ ప్రకారం తమన్ పనితనం పట్ల మహేష్ అంత సంతృప్తికరంగా లేడని, సర్కారు వారి పాటకు యావరేజ్ ఆల్బమ్ ఇచ్చినా ఇంకో అవకాశం సరిగ్గా వాడుకోవడం లేదని అన్నారట. పైగా చేతి నిండా ప్రాజెక్టులతో విపరీతమైన ఒత్తిడిలో ఉన్న తమన్ తో బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకోలేమని చెప్పడం త్రివిక్రమ్ పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. ఎలాగూ మంచి స్నేహం ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చినా తమన్ ఫీల్ కాకపోవచ్చు. కాకపోతే దాని పట్ల సోషల్ మీడియా అభిప్రాయాలు రకరకాలుగా వెల్లువెత్తుతాయి.
దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే మే 31న వచ్చే టైటిల్ వీడియోలో చివరి ఎండ్ కార్డులో తమన్ పేరు ఉందో లేదో చూస్తే కానీ ఖరారుగా చెప్పలేం. ఒకవేళ తప్పిస్తే మాత్రం ఆప్షన్లను వెంటనే చూసుకోవాలి. అనిరుద్ రవిచందర్ తో కష్టం. జివి ప్రకాష్, సంతోష్ నారాయణన్ కొంచెం ఓపిగ్గా చేయించుకుంటే వీళ్ళ నుంచి బెస్ట్ వర్క్ వస్తుంది. సామ్ సిఎస్ మహేష్ రేంజ్ స్టార్ ని డీల్ చేయలేడు.. దేవిశ్రీ ప్రసాద్ తో వర్కౌట్ కష్టం. సో ఇదంతా గాలి ప్రచారమేనా లేక తమన్ ఈ అనుమానాలన్నీ బద్దలు కొడుతూ తనే గుంటూరు కారం(ప్రచారంలో ఉన్న టైటిల్)కి కంపోజర్ గా ఉంటాడా లెట్ సీ
This post was last modified on May 27, 2023 2:05 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…