బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ అన్నంతనే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు. ప్రముఖ నటి కత్రినా కైఫ్ భర్త అన్నంతనే మాత్రం అందరికి గుర్తుకు వచ్చేస్తాడు ఈ యువకుడు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చిన విక్కీ కౌశల్ ప్రత్యేకత ఏమంటే.. సినిమాల్లోకి రాక ముందు ప్రముఖ నటి కత్రినాను విపరీతంగా అభిమానించి.. ఆరాధించాడు. చివరకు ఆమెనే పెళ్లి చేసుకోవటం చూసినప్పుడు అతడి స్టోరీ రీల్ కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లాడారు కత్రినా.
వీరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా అప్పుడప్పుడు రీల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు ఈ జంట. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు (ఐఫా) 2023కు సంబంధించిన మీడియా సమావేశం దుబాయ్ లో జరిగింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీరును అందరూ తప్పు పడుతున్నారు.
తోటి నటుడి విషయంలో మరీ ఇంత అమానుషంగా వ్యవహరించాలా? అన్నది ప్రశ్నగా మారింది. బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. చోటు చేసుకున్న అనూహ్య ఉదంతానికి సంబంధించిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా సల్మాన్ బలుపుతో వ్యవహరించారంటూ తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు కమ్ కత్రినా భర్త విక్కీ కౌశల్ తన అభిమానులతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. అటుగా సల్మాన్ వచ్చారు.
ఆయనతో పాటు ఉన్న సెక్యురిటీ.. ఆయన్ను ఫోటోలు తీసే ఫోటో గ్రాఫర్ తో సహా ఆయన టీం ముందకు వస్తూ.. విక్కీ కౌశల్ ను పక్కకు నెట్టేసింనత పని చేశారు. సల్మాన్ ను చూసిన విక్కీ కౌశల్.. ఏదో మాట్లాడుతున్నప్పటికి సల్మాన్ మాత్రం అతడి వంక కనీసం చూడకుండా వెళ్లిపోయారు. తోటి నటుడి విషయంలో సల్మాన్ తో పాటు.. సల్మాన్ సెక్యూరిటీ సిబ్బంది ఇంత అమర్యాదకరంగా వ్యవహరించటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. తోటి నటుడితో ఎలా వ్యవహరించాలో సల్మాన్ కు తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. విక్కీకి కనీసం సారీ అయినా చెప్పాల్సిందే అన్న మాట పలువురి నోట వస్తోంది. అయితే.. కత్రినా.. సల్మాన్ మధ్య చాలాకాలం ఎఫైర్ ఉందన్న వార్తలు రావటం.. ఆ తర్వాత విడిపోవటం తెలిసిందే. మనసులో ఉన్న ఈ కోపాన్ని సల్మాన్ ఈ తీరులో ప్రదర్శించారా? అన్న భావన వీడియో చూసినంతనే కలుగక మానదు.
This post was last modified on May 27, 2023 11:19 am
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఇవాళ పట్టుదల (విడాముయార్చి) విడుదలయ్యింది. దీనికి ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…