మాస్ టైటిల్ వైపే మహేష్ మొగ్గు?

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవయిటింగ్ మూవీగా తెరకెక్కుతున్న #ssmb28 సినిమాకు సంబందించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ గ్లిమ్స్ రిలీజయ్యాయి. అయితే సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. షూటింగ్ మొదలై కొన్ని నెలలవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఇక టైటిల్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసేందుకు ముహూర్తం ఫిక్సయింది. మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. మోసగాళ్ళకి మోసగాడు రీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్స్ తో కౌంట్ డౌన్ చెప్పించి విడుదల చేయబోతున్నారు.

తండ్రి పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కి తన అప్ కమింగ్ మూవీ నుండి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కి ఓ సెంటిమెంట్. అందుకే కృష్ణ బర్త్ డే కి టైటిల్ గ్లిమ్స్ రెడీ చేశారు. మాస్ కట్ తో గ్లిమ్స్ రెడీ అయింది. సినిమాకు ‘అమరావతికి అటు , ఇటు’ అనే టైటిల్ తో పాటు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ కూడా కన్సిడర్ చేశారు. కానీ ఇప్పుడు మాస్ గ్లిమ్స్ కి క్లాస్ టైటిల్ సెట్ అవ్వడం లేదట. దీంతో మహేష్ దర్శకనిర్మాతలు ఏది ఫిక్స్ చేయాలనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక త్రివిక్రమ్ టైటిల్ సెంటిమెంట్ ప్రకారం అ అక్షరంతో మొదలవ్వాలి. అలా చూస్తే ‘అమరావతి అటు , ఇటు’ అనే టైటిల్ పెట్టాలి కానీ మహేష్ కి మాత్రం ‘గుంటూరు కారం’ టైటిల్ మమకారం ఉందని ఇన్సైడ్ టాక్. మరో రెండు రోజుల్లో టైటిల్ ఫైనల్ చేసి గ్లిమ్స్ కి ఎటాచ్ చేసే ప్లానింగ్ జరుగుతుంది. చూడాలి మహేష్ ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ తోనే ఆడియన్స్ ముందుకొస్తాడేమో మరి.