Movie News

ఫ్యాన్స్‌కు పండగ రోజులు మొదలు

అవును.. టాలీవుడ్ అభిమానులకు పండుగ రోజులు మొదలవుతున్నాయి. వచ్చే నెల రోజుల్లో అనేకానేక కానుకలు వాళ్ల ముందుకు రాబోతున్నాయి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోసం ఓ కానుక రెడీ అవుతోంది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడి కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ టీం ఓ బహుమతి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా అది టైటిల్ ట్రాక్ కావచ్చని అంటున్నారు.

తమన్ సైతం అభిమానులను ఊరించేలా ఓ ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. ఆ రోజు పలు కొత్త సినిమాల పోస్టర్లు లేదా ఇంకేవైనా విశేషాలు వెల్లడయ్యే అవకాశముంది. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో దేశభక్తి యాంగిల్ ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఏదైనా విశేషాన్ని పంచుకునే అవకాశం ఉంటుందంటున్నారు.

ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. ఆ రోజు హంగామా మామూలుగా ఉండదంటున్నారు. ‘ఆచార్య’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజయ్యే అవకాశాలున్నాయి. అలాగే చిరు కొత్త చిత్రాల గురించి ప్రకటనలు రావచ్చు. ఇక ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఆ రోజు ఆయన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలాగే నాగ్ కొత్త చిత్రాల ప్రకటన ఉండొచ్చట.

ఇక సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొత్త సినిమాల విడుదల సందడి లేక అల్లాడిపోతున్న అభిమానులకు ఇలా కొత్త విశేషాలతో అయినా కొంత ఉపశమనం దక్కుతుందేమో చూడాలి.

This post was last modified on August 8, 2020 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

21 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

46 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

48 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

5 hours ago