టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్ గా రూపొందుతున్న వార్ 2 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. 2025 జనవరి 24 రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిలింస్ డెడ్ లైన్ పెట్టేసుకుందట. అంటే ఇంకో ఏడాదిన్నరలోనే మొత్తం పూర్తి చేసి వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధంగా పెట్టేస్తారు. మాములుగా టార్గెట్స్ చేరుకోవడంలో యష్ సంస్థ స్టైల్ లేరు. ఆరు నూరైనా ఖచ్చితంగా రీచవుతారు. కరోనా లాంటి అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే తప్ప వాటిలో ఎలాంటి మార్పు ఉండదు.
బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కలయిక కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాజిటివ్ నెగటివ్ రెండూ మిక్స్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నువ్వా నేనా అని తలపడేలా ఇద్దరి పాత్రలు డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇది దృష్టిలో పెట్టుకునే మొన్న తారక్ పుట్టినరోజుకి హృతిక్ శుభాకాంక్షలు చెబుతూ యుద్ధభూమిలో కలుసుకుందామని హింట్ ఇచ్చాడు. ఇంతకు మించిన లీక్స్ దీనికి సంబంధించి పెద్దగా లేవు. స్క్రిప్ట్ లాక్ చేయడం అయిపోయింది కానీ హీరోల డేట్లు ఫైనల్ చేసుకోవాలి.
జూనియర్ ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ వార్ 2లో లాంఛనంగా జాయినవుతాడు. జనవరి నుంచి ఎక్కువ శాతం డేట్లు అయాన్ కి ఇచ్చేస్తాడు. ఈలోగా ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి మార్చి నుంచి ఎన్టీఆర్ 32 మొదలవుతుంది. సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ తర్వాత వచ్చిన భారీ గ్యాప్ ని వరస సినిమాలతో పూడ్చుకోబోతున్నాడు. పది నెలల గ్యాప్ లో దేవర, వార్ 2 రెండూ థియేటర్లలోకి వచ్చేస్తాయి. ఈలోగా మరో రెండు కమిట్ మెంట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. దర్శకులెవరన్నది డిసైడయ్యాక ప్రకటనలు వచ్చేస్తాయి
This post was last modified on May 22, 2023 12:07 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…