Movie News

ఈ రోజుకు హైలైట్ హృతిక్ ట్వీటే..


సౌత్ హీరోలను ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. వాళ్లంటే ఒక చిన్నచూపు ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మన స్టార్లు బాలీవుడ్ బడా హీరోలను మించి ఎదిగిపోయారు. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తున్నాయి. దీంతో మనవాళ్లను గుర్తించక, ఎలివేషన్ ఇవ్వక తప్పని.. కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కల్పించాయి మారిన పరిస్థితులు.

త్వరలోనే హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్.. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్‌తో ‘వార్-2’ చేయబోతున్నట్లు కొంత కాలం కిందటే వార్త బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి ధ్రువీకరిస్తూ.. హృతిక్ ఆసక్తికర రీతిలో ఈ రోజు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ రోజుకు తారక్‌కు వచ్చిన సోషల్ మీడియా విషెస్‌లో ఇదే హైలైట్ అనడంలో సందేహం లేదు.

‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్. ఒక ఆనందకరమైన.. ఉత్సాహభరితమైన సంవత్సరాన్ని గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధభూమిలో ఎదురు చూస్తూ ఉన్నా. మనం కలిసే వరకు నీ రోజులన్నీ సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ.. చివరి వాక్యాన్ని తెలుగు మాటల్లోనే ఇంగ్లిష్‌లో టైప్ చేశాడు హృతిక్. వార్-2ను కన్ఫమ్ చేస్తూ తారక్‌కు ప్రేమగా చెప్పిన ఈ శుభాకాంక్షలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తారక్ కూడా తనదైన శైలిలో ఈ ట్వీట్‌కు బదులిచ్చాడు. ‘‘నీ అందమైన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇక నీ రోజులు లెక్కించుకో. నీ కోసం ఏం ఎదురు చూస్తోందో తలుచుకుని నువ్వు ప్రశాంతంగా పడుకుంటూ ఉంటావనుకుంటున్నా.. త్వరలో కలుద్దాం’’ అని తారక్ పేర్కొంటూ హృతిక్‌తో వార్‌కు రెడీ అని చెప్పకనే చెప్పాడు.

This post was last modified on May 20, 2023 9:56 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

3 minutes ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

2 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

3 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

3 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

3 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

4 hours ago