ఓవైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి భారీ చిత్రాలు చేస్తూనే.. ఇంకోవైపు మారుతి దర్శకత్వంలో ఒక మిడ్ రేంజ్ సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్. చివరగా ‘పక్కా కమర్షియల్’ లాంటి డిజాస్టర్ డెలివర్ చేసిన మారుతితో ప్రభాస్ సినిమా ఏంటని అభిమానులు కొన్ని రోజుల పాటు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు కానీ.. ప్రభాస్ అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. తనకు వీలు చిక్కినపుడల్లా ఈ సినిమాకు డేట్లు కేటాయిస్తూ చకచకా దీన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఇదని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం మొదలైంది.
మారుతి సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్.. మాస్‌గా ఉంటుందట. తొలిసారి ప్రభాస్ కెరీర్లో లుంగీతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారట. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అంటే భారీతనం అన్నట్లు తయారైపోయింది. ఇదొక బ్యాగేజీ లాగా మారిపోయింది. ఐతే అవన్నీ పక్కన పెట్టేసి ఒక క్యాజువల్ లుక్‌తో ప్రభాస్ దర్శనమివ్వబోతున్నాడట. సినిమా పక్కా ఎంటర్టైనర్ అనే సంకేతాలను ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదొక హార్రర్ కామెడీ కథతో తెరకెక్కుతున్న సినిమా అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఒక కథానాయిక మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తోంది. ఈ మధ్య మంచి ఊపుమీదున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ అభిమానుల్లో ముందు కనిపించిన వ్యతిరేకత వల్ల ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా చడీచప్పుడు లేకుండా సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయారు. కానీ ఫస్ట్ లుక్ లాంచ్ దగ్గర్నుంచి ప్రమోషన్ల హడావుడి గట్టిగానే ఉంటుందంటున్నారు.
This post was last modified on May 20, 2023 11:50 am
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అభిమానులకు కొత్తగా చెప్పేందుకు ఏం లేదు కానీ పబ్లిక్…
చాలామంది సినీ నటుల నట జీవితాన్ని వారు నటించిన సినిమాలను లెక్క చూపించి.. దానికి ముందు.. దాని తర్వాత అంటూ…
అన్నయ్య చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రేమో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాల్లో బయటపడినా ప్రతిసారి కొత్తగా అనిపించడం…