తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలోనే డిజాస్టర్ల కథలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కోట్ల రూపాయల సొమ్ములు అన్యాయంగా హారతి కర్పూరం కావడమంటే చిన్న విషయం కాదు. లైగర్ నష్టాలను తీర్చమని డిస్ట్రిబ్యూటర్లు రోడ్డుకెక్కారు. గత ఏడాది ఆచార్య వచ్చినప్పుడూ ఇదే చర్చ నడిస్తే వివాదాలను సెటిల్ చేయడానికి కొరటాల శివకు నెలల సమయం పట్టింది. ఏజెంట్, శాకుంతలం తీసింది బడా ప్రొడ్యూసర్లు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్టులు, హామీల వల్ల వీటి వ్యవహారాలు వీధికెక్కవు.
కానీ ఇలాంటి కథలు వ్యథలు టాలీవుడ్ కొత్తగా చూడటం లేదు. ఎప్పటి నుంచో బాక్సాఫీస్ చరిత్రలో చేదు జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతి హీరోకి ఇవి అనుభవమే. పవన్ కళ్యాణ్ జానీ, అజ్ఞాతవాసి అనుభవాలను ఫ్యాన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు. చిరంజీవి మృగరాజు తర్వాత నిర్మాత కె దేవీవరప్రసాద్ ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగలేకపోయారు. ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తీసింది ఆయనే. బాలకృష్ణ ఒక్క మగాడు ప్రభావంతో వైవిఎస్ చౌదరి మళ్ళీ అగ్ర హీరోలను కలుసుకోలేకపోయాడు.
నాగార్జున రక్షకుడు పాతికేళ్ల క్రితమే పదిహేను కోట్లకు అమ్ముడుపోతే అందులో పావొంతు కూడా వెనక్కు తేలేకపోయింది. రెబల్ కు జరిగిన ఓవర్ బడ్జెట్ వల్లే లారెన్స్ కు నిర్మాతలకు విభేదాలు వచ్చాయి. మహేష్ బాబు నాని వల్ల అతని స్వంత అక్కయ్య మంజుల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తారక్ శక్తి ముప్పై కోట్లు పోగొట్టిందని అశ్వినిదత్తే ఒప్పుకున్నారు.
అఖిల్ మొదటి సినిమా కంటెంట్ తో పాటు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచి నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. నిర్మాతతో మొదలుపెట్టి ఎగ్జిబిటర్ దాకా అందరిని బాధించిన సినిమాలు వస్తూనే ఉంటాయి. ఖర్చు మీద అదుపు లేక, నాసిరకం కథల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లిన ప్రతిసారి అందరూ ఇలాంటి దెబ్బలు తిన్నవాళ్ళే. మార్పు రాదా అంటే వస్తుంది స్క్రిప్ట్ ల మీద సరైన శ్రద్ధతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు.
This post was last modified on May 16, 2023 4:13 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…