జ్యోతిక అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా చంద్రముఖి. హీరో సూర్యకు భార్య కాక మునుపే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికి అంకితమైపోయింది. గత రెండు మూడేళ్లుగా అడపాదడపా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈవిడకు తెలుగులో చిరంజీవి ఠాగూర్, నాగార్జున మాస్ లాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. రవితేజ షాక్ ఆశించిన ఫలితం అందుకోలేదు. తమిళంలో మాత్రం లెక్కలేనన్ని హిట్లున్నాయి. అయితే జ్యోతిక తెరంగేట్రం చేసింది 1998లో వచ్చిన ప్రియదర్శన్ హిందీ చిత్రం డోలి సజా కే రక్నాతో
మరుసటి ఏడాదే అజిత్ వాలి రూపంలో పెద్ద బ్రేక్ దక్కడంతో అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. తిరిగి 2001లో సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో లిటిల్ జాన్ అనే బాలీవుడ్ మూవీ తప్ప మళ్ళీ ఎప్పుడు నార్త్ వైపు చూడలేదు. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత జ్యోతిక హిందీలో అడుగు పెట్టనుంది. అజయ్ దేవగన్ మాధవన్ ల కాంబినేషన్ లో వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందబోయే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో ప్రధాన పాత్రకు ఎంపికయ్యింది. జ్యోతిక మాధవన్ డుండుండుం,12B, ప్రియమన తొజి లాంటి సినిమాల్లో జంటగా నటించారు.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ ప్యాన్ ఇండియా మూవీని అన్ని భాషల్లోనూ ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టితో కలిసి ఇటీవలే మలయాళంలోనూ జ్యోతిక ఈ పునఃప్రవేశం పూర్తయ్యింది. తెలుగులోనూ ఆఫర్లు వెళ్తున్నాయి కానీ వదిన అక్క పాత్రలకు నిర్మొహమాటంగా నో చెబుతోంది. ఏదైనా కథను మలుపు తిప్పే క్యారెక్టర్ అయితేనే ఎస్ చెబుతానని తన దగ్గరకు వచ్చే దర్శకులకు క్లియర్ గా చెబుతోంది. లారెన్స్ హీరోగా రూపొందుతున్న చంద్రముఖి 2లో జ్యోతికతో ఒక ప్రత్యేక క్యామియో చేయించే ప్లానింగ్ లో ఉన్నారు దర్శకులు వాసు. ఇంకా అఫీషియల్ కావాల్సి ఉంది