సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు సినిమా వేడుకలకు వస్తే ఏ హడావుడి ఉండేది కాదు. ఆయన ప్రెస్ మీట్లలో పాల్గొన్నా కూడా మామూలుగా సాగిపోయేది. ఇక నరేష్ నటించిన సినిమా తాలూకు ప్రోమో థియేటర్లలో రిలీజైతే ఆయన్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది.
లేటు వయసులో కన్నడ నటి పవిత్ర లోకేష్ తో ఆయన ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి మీడియాతో పాటు జనాల్లోనూ ఆయన పట్ల క్యూరియాసిటీ పెరిగిపోయింది. అందులోనూ తమ నిజ జీవిత కథతోనే ‘మళ్ళీ పెళ్ళి’ పేరుతో సినిమా తీస్తుండటం జనాలకు పెద్ద షాక్. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా నరేష్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు.. వెళ్లినపుడు.. ప్రెస్ మీట్లో మాట్లాడినపుడు హడావుడి మామూలుగా లేదు. మీడియా ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. శుక్రవారం ‘కస్టడీ’ సినిమా ఫ్యాన్స్ షో సందర్భంగా ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్ ప్రదర్శిస్తే.. నాగచైతన్య ఎంట్రీ సీన్‌కు ఉన్నంత రెస్పాన్స్.. ఈ ట్రైలర్‌కు కూడా కనిపించింది.
ఆ ట్రైలర్ రన్ అవుతున్నంతసేపు ఒకటే హోరు. ఒక స్టార్ హీరోను చూసినట్లు నరేష్ కనిపించినపుడల్లా జనాలు హోరెత్తించేశారు. నరేష్‌కు ఇంత క్రేజ్ ఏంటి అని మిగతా జనాలంతా షాకయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ‘మళ్ళీ పెళ్ళి’ ట్రైలర్‌కు ట్యూబ్‌లో, మిగతా సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ ట్రైలర్ గురించి జనాల కామెంట్లు చదివితే నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఎలాగైతేనేం తన సినిమాకు నరేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారన్నది వాస్తవం.
This post was last modified on May 12, 2023 2:36 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్‌కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…