ఆమె సెక్సీ ఫిగర్‍కి కోటిన్నర దాసులు!

రకుల్‍ ప్రీత్‍ సింగ్‍కి ఇప్పుడు అవకాశాలు చెప్పుకోతగ్గ స్థాయిలో రావడం లేదు కానీ తన సెక్సీ లుక్స్ కి వున్న క్రేజ్‍ అయితే ఏమాత్రం తగ్గలేదు. సోషల్‍ మీడియాలో రకుల్‍ ఫోటోలు పెట్టినపుడల్లా కుర్రాళ్లు వెర్రెత్తిపోతూ వుంటారు. తన గ్లామర్‍కి ఉన్న క్రేజ్‍ ఏమిటనేది రకుల్‍కి కూడా బాగా తెలుసు. అందుకే క్రమం తప్పకుండా ఏదో ఒక ఫోటో పెట్టి తన ఫాన్స్ కి కనువిందు చేస్తూ వుంటుంది.

రకుల్‍ ప్రీత్‍కి అటు బాలీవుడ్‍తో కూడా పరిచయం వుంది కనుక ఆమె అందానికి దేశవ్యాప్తంగా ఆరాధకులున్నారు. అందుకే ఆమెకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఏకంగా కోటిన్నరమంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. రకుల్‍ ఎన్నో విజయాలు చూసినా కానీ తన వెనక ఇంతటి ‘బలగం’ ఉందనేది ఖచ్చితంగా ఆనందాన్నిచ్చే అంశమే కదా. అందుకే తన ఫాలోవర్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో వుంది కనుక పారితోషికం తగ్గించుకుంటే, వెబ్‍ సిరీస్‍లలో నటిస్తే డిమాండ్‍ ఎక్కువ ఉంటుంది కనుక రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ మిగతా అందరికంటే ముందే అటుగా దృష్టి సారించింది. ఇక ఆమె చేతిలో సినిమా అవకాశాలు లేకపోలేదు కనుక మళ్లీ బౌన్స్ బ్యాక్‍ అయి మునుపటి క్రేజ్‍ తెచ్చుకోగలననే నమ్మకాన్ని ఆమెలో ఈ లాక్‍డౌన్‍ రెట్టింపు చేసింది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)