సినిమా తీయడం కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకోవడం పెద్ద సవాల్. దానికి చిన్నా పెద్ద నిర్మాణ సంస్థలనే భేదాలుండవు. కేవలం బ్యానర్లు చూసి వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. శాకుంతలంని అంతగా ప్రమోట్ చేసుకున్న దిల్ రాజుకి ఎలాంటి అనుభవం ఎదురయ్యిందో చూశాం. స్టార్లు ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే ఇక వరస ఫ్లాపుల యూత్ హీరోల గురించి చెప్పేదేముంది. ఈ నెల 18న అన్నీ మంచి శకునములే విడుదల కాబోతోంది. సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత స్వప్న సినిమా నుంచి వస్తున్న చిత్రమిది.
సంతోష్ శోభన్ హీరో కావడంతో దీని మీద బజ్ లేదు. గత డిజాస్టర్లు అతని మార్కెట్ మీద బాగా ప్రభావం చూపించాయి. ఓ బేబీ రూపంలో నందిని రెడ్డికి హిట్టు ఉన్నా కేవలం ఆ పేరు మీదే భారీగా టికెట్లు తెగడం కష్టం. అందుకే నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ బృందాలు అన్నీ తామై తమ ఎఫర్ట్స్ అన్నీ సర్వం దీని కోసమే పెడుతున్నారు. వరుసగా మీడియా మీట్లు, బంతి భోజనాలు, పాటలు, టీజర్ లాంచులు ఒకటేమిటి అన్నీ వేడుకలా చేస్తున్నారు. గత నెల ఈ టీమ్ ప్రముఖ కాలేజీలు ఒక రౌండ్ వేసొచ్చి పబ్లిసిటీ చేసుకుంది. రాబోయే పది రోజుల్లో దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలి.
ఇన్ని తిప్పలు ఎందుకంటే కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా క్యాస్టింగ్ అట్రాక్షన్ లేని సినిమాల కోసం జనం థియేటర్లకు రావాలంటే ఆ సంథింగ్ స్పెషల్ ఏంటనేది ముందే చెప్పాలి. ఏదో ఒక ప్రత్యేకత లేనిదే జనాలు హాళ్లకు రావడం లేదు. అలాంటిది సీనియర్లు ఎందరు ఉన్నా సరే ప్రచారం కోసం చెమట చిందించాల్సిందే. బిజినెస్ పరంగా దీనికి ఇబ్బంది లేదు. తర్వాత సినిమా ప్రాజెక్ట్ కె కావడం, అశ్వినిదత్ పెద్దరికం, సీతారామం ఎఫెక్ట్ ఇవన్నీ థియేట్రికల్ హక్కులకు సానుకూలంగా పని చేశాయి. టైటిల్ లో ఉన్న శకునములు బాక్సాఫీస్ దగ్గరా మంచిగా పనిచేస్తే చాలు.
This post was last modified on May 8, 2023 9:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…