పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాల ప్రియుడు. ప్రతీసారి ఓ కొత్త పుస్తకం గురించి చెబుతూ అభిమానులకు షాక్ ఇస్తుంటాడు పవన్. తాజాగా ‘ఖారవేలుడు’ అనే పుస్తకం, తనలో తొలిసారి రాజకీయాల గురించి ఆలోచన కలిగేలా చేసిందంటూ ట్విట్టర్ ద్వారా వివరించాడు పవన్. ‘మొదటిసారి డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమా ఫెయిల్యూర్‌తో మానసికంగా కృంగిపోయిన సమయంలో నాగబాబు ఈ పుస్తకం నాకు ఇచ్చాడు…’ అంటూ ఓ పాత పుస్తకాన్ని కొత్తగా పరిచయం చేశాడు జనసేనాని.
ఖాళీ సమయం కనిపిస్తే చాలు, నిత్యం ఏదో పుస్తకం చదువుతూ కనిపించే పవన్ కళ్యాణ్… సొంత పుస్తకం ఎప్పుడూ రాస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓ నిత్య అన్వేషిగా, జనాల కోసం ఏదో చేయాలని పరితపించే ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్‌కు తెలుగురాష్ట్రాల్లో తిరుగులేని ఇమేజ్ ఉంది.
బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసే పవర్ స్టార్ సొంతంగా పుస్తకాన్ని రచిస్తే అది సాహితీలోకంలో ఓ సెన్సేషన్ అవుతుంది. రాజకీయాల్లో ఇంకా సక్సెస్ కాకపోయినా, తన స్పీచ్‌లతో కార్యకర్తలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పదునైన ఆలోచనలకు అక్షర రూపం కల్పిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక.
మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఓ అర్థంకాని ఫజిల్ లాంటిదే. ఆవేశం, ఆలోచన కలగలిసిన పవన్ కళ్యాణ్ తన జీవిత చరిత్రను స్వయంగా రచిస్తే… అది సంచలనం క్రియేట్ చేయడం పక్కా.
ఎన్నో ఎత్తుపల్లాలున్న పవన్ జీవితం పుసక్తరూపంలో వస్తే సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికనట్టే. మరి తనలోని సాహిత్య కోణాన్ని బయటికి తీసి పవన్ కళ్యాణ్ పేపర్‌పై ఎప్పుడు పెడతాడో చూడాలి.