ఒక హీరోయిన్‌తో కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తితో మరో హీరోయిన్ ప్రేమలో పడటం ఎక్కువగా బాలీవుడ్లోనే చూస్తాం. అక్కడి హీరోలు, హీరోయిన్లు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేయడం మామూలే. దక్షిణాదిన ఇలాంటి ఉదంతాలు తక్కువగానే కనిపిస్తాయి. నయనతార, శింబు లాంటి వాళ్లు ఇలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉన్నారు. వీళ్ల లాగా పాపులర్ కాని లవ్ స్టోరీలు కూడా కొన్ని ఉన్నాయి.
అందులో త్రిషతో ఒక టైంలో నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయిన వరుణ్ మణియన్‌తో బిందు మాధవి లవ్ స్టోరీ కూడా ఒకటి. ఈ ప్రేమ కథ గురించి ఒక సమయంలో జోరుగా వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇద్దరూ విడిపోయిన సంకేతాలు వచ్చాయి. ఐతే ఈ లవ్ స్టోరీ గురించి ఎప్పడూ మాట్లాడని బిందు మాధవి..
తెలుగులో నటించిన న్యూసెన్స్ అనే సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన బిందు మాధవి.. మీడియాలో వచ్చే రూమర్ల గురించి స్పందించింది. త్రిష బాయ్‌ప్రెండ్‌తో డేటింగ్ అంటూ తన గురించి వచ్చిన రూమర్ గురించి స్పందిస్తూ.. అది నిజమే అని ఆమె ఒప్పుకుంది. అవును.. నేను త్రిషప్రేమించిన వ్యక్తితో ఒక సమయంలో డేటింగ్‌లో ఉన్నాను. కానీ అతను అప్పటికే త్రిష నుంచి విడిపోయాడు అని బిందుమాధవి పేర్కొంది.
మరో వైపు న్యూసెన్స్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నవదీప్ మాట్లాడుతూ.. తన మీద మీడియాలో లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయన్నాడు. తన వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని.. తన ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని మీడియాలో అబద్ధపు రాతలు రాశారన్నాడు. తన ఇంట్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ జరిగితే దాన్ని రేవ్ పార్టీ అని రాసేశారని మీడియా వాళ్లను నిందించాడు నవదీప్.
This post was last modified on May 8, 2023 9:58 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…