‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మరో పది రోజులు ?

పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. నెలలో ఏ సినిమాకి డేట్స్ ఇస్తున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఈ మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు పవన్. వెంటనే సుజీత్ ఓజీ సినిమాకు డేట్స్ ఇచ్చేసి ముంబై వెళ్ళిపోయాడు. ఇప్పటికే కొన్ని సీన్స్ తీశారు. ప్రస్తుతం పవన్ , ప్రియాంక మోహన్ మీద ఓ సాంగ్ ఘాట్ జరుగుతుంది. పూణే లో తెరకెక్కుతున్న ఈ సాంగ్ తర్వాత పవన్ హైదరాబాద్ తిరిగి వస్తాడు.

అయితే #og తర్వాత పవన్ హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ ఇస్తారని మొన్నటి వరకు వినిపించింది. కానీ ఇప్పుడు పవన్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ కోసం పది రోజులు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో హరీష్ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతున్న విషయాన్ని ట్వీట్ చేశాడు.

నిజానికి రెండు నెలల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ డేట్స్ ఇచ్చే ఆలోచన లేదు. కానీ ఇప్పుడు ముంబై ఉన్నపళంగా నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రెండో షెడ్యూల్ ప్రిపరేషన్ కోసం హరీష్ , మైత్రి నిర్మాతలు హడావిడి పడుతూ ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి మే 11 న చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్. గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ కావడంతో ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.