Movie News

అప్పుడు గౌతమ్ ఇప్పుడు అకీరా

స్టార్ హీరోల వారసులకు ఉండే క్రేజే వేరు. రేణు దేశాయ్ వెర్షన్ ఎలా ఉన్నా అకీరానందన్ ని పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు చూస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు కానీ కుర్రాడు మాత్రం రెగ్యులర్ గా హైదరాబాద్ లో కనిపిస్తూనే ఉంటాడు. ప్రీమియర్ షోలకు రావడం, మీడియా కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేయకపోవడం, అడవి శేష్ దగ్గర ఎక్కువ సమయం గడపడం లాంటి కారణాల వల్ల అబ్బాయికి సినిమాల మీద ఆసక్తి ఏంటో అర్థమవుతూనే ఉంది. తాజాగా వచ్చిన లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగానే తిరుగుతోంది

దాని ప్రకారం ప్రస్తుతం పవన్ చేస్తున్న ఓజిలో గ్యాంగ్ స్టర్ పాత్ర మూడు టైం ఫ్రేమ్స్ లో ఉంటుందట. అందులో ఒకటి పదిహేడేళ్ల టీనేజ్ ప్రాయం లో వస్తుంది. దాన్ని అకీరాతో చేయిస్తే బాగుంటుందనే ప్రతిపాదన దర్శకుడు సుజిత్ పెడితే పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. ఒకవేళ ఓకే అయితే అంతకన్నా స్పెషల్ న్యూస్ పవన్ ఫ్యాన్స్ కి ఏముంటుంది. గతంలో 1 నేనొక్కడినే కోసం గౌతమ్ ఇలాగే మహేష్ బాబు చిన్ననాటి క్యారెక్టర్ చేయడం అందరికీ గుర్తే. ఫలితం అటుఇటు అయ్యింది కానీ ఒక మంచి క్యారెక్టర్ అయితే అబ్బాయికి పడింది.

ఇది ప్రస్తుతానికి గాసిప్ గానే తిరుగుతోంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం. వాస్తవమైతే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఇంతకీ రేణు దేశాయి మనసులో ఏముందో ఇది కన్ఫర్మ్ అయ్యాకే తెలుస్తుంది. దేశాయ్ పేరు కన్నా కొణిదెల బ్రాండ్ తోనే అకీరాకు ఇండస్ట్రీ ఎంట్రీ సులభంగా ఉంటుంది కాబట్టి బహుశా ఆపడం లాంటివేవీ ఉండకపోవచ్చు. పైగా పవన్ ఆఖరి కొడుకుది చాలా చిన్న వయసు కాబట్టి ఇప్పుడున్న ఫ్యాన్స్ అందరూ అకీరానే చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఓజిని వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవి విడుదల టార్గెట్ గా షూట్ చేస్తున్నారు

This post was last modified on May 3, 2023 12:00 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

15 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago