వచ్చే శుక్రవారం గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేదు. గోపీచంద్ సినిమా ట్రైలర్ చూసి రొటీన్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టకుండా రొటీన్ గా కట్ చేయడం ఎఫెక్ట్ అయింది.
నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి నాంది లాంటి కథతోనే మరో యాంగిల్ చూపించబోతున్నాడనిపిస్తున్నాడని ప్రేక్షకుల్లో ఓ ఐడియా వచ్చేసింది. అల్లరి నరేష్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవి. అలాగే మంచి థియేటర్స్ పడేవి. కానీ ఆపోజిట్ గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమా ఉండటంతో ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. దీంతో అల్లరి నరేష్ ఉగ్రం కి పెద్ద దెబ్బే తగిలింది.
రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ మేకర్స్ ఊహించినట్టుగా బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. మొదటి రోజు టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. గోపీచంద్ ముందు సినిమాలు బాగా నిరాశ పరచడంతో రామబాణంకి కూడా మినిమం ఓపెనింగ్స్ వచ్చేలా లేవు.
This post was last modified on May 2, 2023 10:54 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…