Movie News

షారుఖ్ కోసం ఖైదీ వేటను వాడేశారా

మొన్న జనవరిలో పఠాన్ రూపంలో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని కంబ్యాక్ ని ఘనంగా జరుపుకున్న షారుఖ్ ఖాన్ త్వరలో జవాన్ గా రాబోతున్నాడు. కోలీవుడ్ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో నయనతార హీరోయిన్, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేశారని ముంబై టాక్. ముందు ప్రకటించిన ప్రకారం జూన్ లో విడుదల చేయాలా వద్దానే విషయంలో టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. దీపావళికి వెళ్లే ప్రతిపాదన చర్చల దశలో ఉందని సమాచారం.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం జవాన్ ఒక కమల్ హాసన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథట. వివరాల్లోకి వెళ్తే 1985లో తమిళంలో ఓరు ఖైదీయిన్ డైరీ వచ్చింది. భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన ఈ రివెంజ్ డ్రామా అప్పట్లో బ్లాక్ బస్టర్. సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగులో ఖైదీ వేటగా డబ్బింగ్ చేస్తే ఇక్కడా మంచి విజయం దక్కింది. కృష్ణంరాజు తిరిగి ఇదే స్టోరీతో మరణ శాసనం చేశారు కానీ ఆడలేదు. హిందీలో అమితాబ్ బచ్చన్ తో భారతీరాజానే మళ్ళీ రీమేక్ తీస్తే సూపర్ హిట్ గా నిలిచి క్లాసిక్స్ జాబితాలో చేరింది. దీని ట్రాక్ రికార్డు అంతుంది.

భార్యను చంపి తనకు యావజ్జీవ శిక్ష పడేలా చేసిన పెద్దమనుషుల మీద ప్రతీకారం తీర్చుకునే వృద్ధుడి కథ ఇది. పోలీస్ ఆఫీసరైన కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మక్కికి మక్కి కాకపోయినా ఇదే పాయింట్ ని తీసుకుని దానికి సోషల్ మెసేజ్ జోడించి అట్లీ జవాన్ ని తీర్చిదిద్దుతున్నట్టు వినికిడి. ఇతని స్టయిలే అంత. తేరిని కూడా విజయ్ కాంత్ క్షత్రియుడు నుంచి తెలివిగా ఎత్తేశాడు. ఇప్పుడు జవాన్ విషయంలోనూ అలాగే జరిగినా ఆశ్చర్యం లేదు. షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత డ్యూయల్ రోల్ కనిపించబోతున్నారని నెలల క్రితం వచ్చిన టాక్ నిజమేనన్న మాట.

This post was last modified on April 29, 2023 4:28 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

1 hour ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

7 hours ago