Movie News

అక్కినేని బ్రాండుకు బీటలు

టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో అక్కినేని వారిది ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ లాగా మాస్ హీరో కాకపోయినా, మాస్ సినిమాలు చేయకపోయినా.. తన శైలి క్లాస్ సినిమాలతోనే భారీ విజయాలు అందుకున్నారు.

దశాబ్దాల పాటు తన ఆధిపత్యాన్ని చాటారు. ఏఎన్నార్ స్థాయిలో హవా సాగించకపోయినా.. ఆయన వారసుడు అక్కినేని నాగార్జున సైతం తన స్థాయిలో ఘనవిజయాలే అందుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగాడు.

మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రయోగాత్మక, సాహసోపేత చిత్రాల్లో నటిస్తూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించాడు నాగ్. కానీ బాధాకార విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా ఆయన బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆయన నట వారసులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు.

2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగార్జునకు నిఖార్సయిన మాస్ హిట్ లేదు. రోజు రోజుకూ ఆయన ఫాలోయింగ్, మార్కెట్ పడిపోతున్నాయి. గత ఏడాది ‘ది ఘోస్ట్’ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు కింగ్. ఇక మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి.. తన శైలిలో ఏదో లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు చేసి అడపాదడపా విజయాలు అందుకుంటున్న నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్యకు గత ఏడాది ‘థాంక్యూ’ దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది.

ఇది చైతూకు నప్పే సినిమానే అయినా.. అది కూడా ఆడలేదు. ఎంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా సరే.. మరీ ఐదు కోట్ల షేర్ కూడా రాబట్టలేదంటే చైతూ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఓ మోస్తరు సక్సెస్ అందుకుని.. ఈసారి పెద్ద మాస్ హీరో అయిపోదామని నాగ్ చిన్న కొడుకు అఖిల్ చేసిన ‘ఏజెంట్’ పరిస్థితి ఇప్పుడు ఏమైందో తెలిసిందే. మార్నింగ్ షోలతోనే దీని తలరాత ఏంటో తేలిపోయింది. అక్కినేని వారి ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. కేవలం 9 నెలలో వ్యవధిలో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మూడు పెద్ద డిజాస్టర్లు ఇవ్వడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఈ ముగ్గురూ బలంగా కమ్ బ్యాక్ ఇవ్వకపోతే అక్కినేని బ్రాండు మరింత బీటలు వారడం ఖాయం.

This post was last modified on April 29, 2023 5:58 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

13 minutes ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

34 minutes ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

1 hour ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

1 hour ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago