Trends

ఎన్నికలపై కేసీఆర్ రూటు మార్చారా…?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు. ఎవరితో ఎప్పుడు స్నేహంగా ఉంటారో..ఎవరిని ఎప్పుడు గెంటి వేస్తారో చెప్పడం ఎంతటి రాజకీయ దురంధరుడికైనా కష్టమే.తిట్టిన వారినే అక్కున చేర్చుకునే సమర్థత కూడా కేసీఆర్ కే ఉంది. అందుకే బీఆర్ఎస్ అధినేత విషయంలో అవునంటే కాదనిలే… కాదంటే అవుననిలే అన్న పాట పాడుతుంటారు..

నాలుగు నెలల క్రితం కేసీఆర్ ఒక పాచిక వదిలారు. ఈ సారి సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని వారంతా బాగా పనిచేసుకుని నియోజకవర్గాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించారు. దానితో సిట్టింగులు అమితానందంలో మునిగిపోగా, ఆశావహులు తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. ఇంతకాలం కష్టపడి పనిచేసినందుకు ఈసారైనా టికెట్ వస్తుందనుకుంటే ఇలా బాంబు పేల్చాడేమిట్రా అని కొందరు బయటకు తిట్టుకుంటే మరికొందరు లోలోన మథనపడ్డారు.

కేసీఆర్ స్టేట్ మెంట్స్ ను నమ్మాల్సిన పనిలేదని కొన్ని వర్గాల్లో వినిపించిన మాట. బీజేపీ దూకుడు తారా స్థాయిలో ఉన్న రోజుల్లో ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించినట్లు కొందరు వాదించారు. ఎన్నికల నాటికి ఆయన ప్లేట్ ఫిరాయిస్తారని కొందరికి మొండి చేయి చూపించి కొత్తవారికి అవకాశం ఇస్తారని చెప్పుకున్నారు. ఇప్పుడు వారి మాటే నిజమయ్యేలా ఉంది.

గురువారం జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్, తమ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు నిధులను లబ్ధిదారులకు అందించే క్రమంలో రెండు మూడు లక్షలు కమిషన్ కొట్టేస్తున్నారని వారి జాబితా మొత్తం తన వద్ద ఉందని చెప్పారు. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని, వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఉండవని హెచ్చరించారు. పార్టీలో వర్గపోరు ఎక్కువైందని, కొందరు ఎమ్మెల్యేల ప్రోగ్రస్ సరిగ్గా లేదని వివరించారు.

తాజా మీటింగుతో కేసీఆర్ వైఖరి వెల్లడైందని ఇంటా బయట వినిపిస్తున్న మాట. సీఎం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము ముందే హెచ్చరించామని వారు పట్టించుకోనందునే ఇప్పుడు కేసీఆర్ ట్రాప్ లో పడ్డారని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని బీజేపీ విమర్శిస్తోంది. మరి అది నిజమో కాదో చూడాలి….

This post was last modified on April 29, 2023 4:34 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

2 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

2 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

3 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

3 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

4 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

4 hours ago