సినీ రంగానికి దూరమైన కొన్నేళ్లకే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది రోజా. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కీలక స్థానంలో ఉందామె. ఆ రెండు పార్టీల్లో అధికార ప్రతినిధిగా మీడియాలో బాగా పేరుపొందింది.
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది. మంత్రి పదవికి చాలా చేరువగా వెళ్లింది. అది దక్కకపోయినా కేబినెట్ హోదాకు సమానమైన ఏపీఐఐసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది.
వైకాపాలో కీలక నేతగా ఉన్న రోజా.. ఇప్పుడు ఆశ్చర్యకర వ్యాఖ్య చేసింది. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో లేనట్లు మాట్లాడింది. ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉంటూ జబర్దస్త్ లాంటి కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించడం మీద రోజా తరచుగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె ఈ షోను విడిచిపెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తుంటాయి.
కానీ రోజా అవేమీ పట్టించుకోకుండా షోలో కొనసాగుతోంది. ఇదే విషయమై తాజాగా మీడియా వాళ్లు ప్రశ్నిస్తే రోజా తనదైన శైలిలో బదులిచ్చింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలాగే కంటిన్యూ అవుతోందనే బాధతో చాలామంది మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.
అలాగే తాను జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. ఈ మాటే అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారడం అంటే రోజా ఉద్దేశంలో ఏంటని అడుగుతున్నారు. ఎమ్మెల్యే అయి.. కేబినెట్ స్థాయి పదవి కూడా చేపడుతున్న వ్యక్తి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు కాకపోవడం ఏంటో?
This post was last modified on August 4, 2020 6:06 pm
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…