లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘విక్రమ్’ మూవీతో. యంగ్ డైరెక్టర్ లోెకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం అంచనాలను మించిపోయి భారీ విజయాన్నందుకుంది. దీంతో కమల్ కెరీర్‌కు మళ్లీ మంచి ఊపు వచ్చింది. దీని తర్వాత ఆయన మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సినిమా చివరి దశలో ఉంది. ఆ పని అవగొట్టి అతి త్వరలోనే మణిరత్నం సినిమా మీదికి వెళ్లబోతున్నాడు కమల్.
మూడు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత ఆయన మళ్లీ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘నాయకుడు’ అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇంత కాలానికి ఈ కాంబో కార్యరూపం దాలుస్తుండటం అభిమానులకు అమితానందాన్ని ఇస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండడం విశేషం.
అనౌన్స్‌మెంట్ తర్వాత వార్తల్లో లేని ఈ చిత్రం.. సైలెంటుగా ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు మణిరత్నం. ఈ చిత్రానికి కథానాయికగా ఇంతకుముందు త్రిష, నయనతార తదితరుల పేర్లు వినిపించాయి. ఐతే ఇప్పుడు ఆ పేర్లు వెనక్కి వెళ్లిపోయాయి. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే కథానాయికగా ఖరారు చేశారట. ఇంకో లేడీ క్యారెక్టర్ కూడా ఉంటుందంటున్నారు కానీ.. దాని గురించి క్లారిటీ లేదు. విద్య అయితే కమల్‌కు జోడీగా ఫిక్సయినట్లే అంటున్నారు. ఈ జోడీ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు.
విశేషం ఏంటంటే.. ఈ సినిమా కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. చనిపోయిన ఒక మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది. మణిరత్నం నుంచి ఈ దశలో ఇలాంటి సినిమాను ఊహించలేం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు కమల్, మణిరత్నం.
This post was last modified on April 28, 2023 10:19 am
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…