ఈ నెల ఏప్రిల్ 28 విడుదల కాబోతున్న ఏజెంట్ డేట్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ చూసిన తేదీ అది. ఎన్టీఆర్ అడవిరాముడు సృష్టించిన రికార్డులకు పునాది పడింది అక్కడే. 1977లో ఈ అద్భుతం జరిగింది. మహేష్ బాబు కెరీర్ లోనే ఇప్పటికీ బెస్ట్ కమర్షియల్ మూవీగా చెప్పుకునే పోకిరి మాయాజాలం జరిగింది ఈ నెంబర్ తోనే. అలీ లాంటి కమెడియన్ ని హీరోగా పెట్టి ఎస్వి కృష్ణారెడ్డి యమలీల తీస్తే వంద రోజులకు పైగా ఆడి అద్భుత విజయం సొంతం చేసుకున్నది ఇదే డేట్ కి. రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 వచ్చిన పవర్ ఫుల్ సెంటిమెంట్ దీనికి ఉంది.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న 28న ఏజెంట్ రావడం అంటే అక్కినేని ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. ఇదే మాట మీడియా అడిగినప్పుడు అఖిల్ రియాక్ట్ అవుతూ చాలా సంతోషంగా ఉందని పోకిరిని యాభై సార్లకు పైగా చూశానని ఇక బాహుబలి తన ఆల్ టైం ఫెవరెట్ గా చెప్పుకొచ్చాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్, చరణ్ లు గెస్టులుగా వస్తారన్న ప్రచారానికి స్పందిస్తూ వాళ్ళు విష్ చేసిన మాట నిజమే కానీ రావడం మాత్రం తెలియదని తేల్చేశాడు. గెస్టులు ఎవరూ లేకుండానే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందన్న సంకేతం క్లియర్ గా ఇచ్చాడు.
మొత్తానికి ఏజెంట్ సంబరం బయట హీరోలు లేకుండానే జరగబోతోంది. ఒకవేళ సర్ప్రైజ్ గా వస్తే చెప్పలేం అన్నట్టుగా ఉంది అఖిల్ మాట. ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న అక్కినేని కుర్రాడు ఈ సినిమాతో మాస్ మార్కెట్ ఏర్పడుతుందన్న ధీమాలో ఉన్నాడు. అందులోనూ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వేగంగా చేయడం లేదన్న అసంతృప్తి అభిమానుల్లో తొలగిపోవాలంటే దీని ఘనవిజయం చాలా కీలకం. ట్రైలర్ వచ్చాక స్పందన బాగుంది. టాలీవుడ్ లోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీని మీద ప్రీ పాజిటివ్ బజ్ బాగా ఉంది