సీనియర్ నటులు నరేష్ తన వ్యక్తిగత జీవితంలో నూతన భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉన్న పవిత్ర లోకేష్ తో ఉన్న బంధం గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆయన మూడో భార్య చేస్తున్న లీగల్ పోరాటం అందరికీ తెలిసిందే. అయితే చట్టబద్దంగా వివాహం చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం లేకపోవడంతో తన లైఫ్ లో ఏం జరిగిందని అందరికీ వివరించడం కోసం నరేష్ తిరిగి సినిమానే మాధ్యమంగా ఎంచుకోవడం ఆమధ్య టైటిల్ లాంచ్ లో చూశాం. మళ్ళీ పెళ్లి పేరుతో తెలుగు కన్నడ భాషల్లో రూపొందిస్తున్న బై లింగ్వల్ కి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్సకత్వం వహించారు.
దీనికయ్యే బడ్జెట్ అంతా నరేష్ దే. ఇవాళ విడుదల చేసిన టీజర్ ఆయన వివాహ వ్యవహారాలకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సినిమాగా మారాయని అర్థమవుతుంది. మాజీ భార్య మీడియా ముందుకు వెళ్లడం, నరేష్ మీద ఫిర్యాదు చేయడం, ఆయనతో పాటు పవిత్ర ఒక హోటల్ లో ఉండగా కెమెరాలు తీసుకెళ్లి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం ఇవన్నీ కూలంకుషంగా చూపించినట్టు కనిపిస్తోంది. ఇక్కడ నరేష్ ఉద్దేశం ఒకటే. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పడం కంటే ఇలా ఒక మూవీ రూపంలో ఇస్తే పబ్లిసిటీ, ప్రమోషన్, బిజినెస్ అన్నీ ఒకేసారి జరిగిపోతాయి.
వీటికి తోడు ఎక్స్ వైఫ్ కి బోలెడు కౌంటర్లు దీని ద్వారా వేసినట్టు ఉంటుంది. ఇన్ని దశాబ్దాల టాలీవుడ్ లో ఎందరో తారల జీవితాల్లో ఇద్దరు లేదా ముగ్గురు లైఫ్ పార్ట్ నర్స్ ఉన్నారు కానీ ఎవరివీ మరీ ఇంత స్థాయిలో వివాదం కాలేదు. అది కూడా అయిదు పదులు దాటేసిన లేటు వయసులో. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి కోటి రెండు కోట్లు పోయినా పర్వాలేదని నరేష్ ఇలా చేయడం మొదట్లో రిస్క్ అనిపించింది కానీ తీరా చూస్తే ఇప్పుడీ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. ఎలాగూ బడ్జెట్ తక్కువ కాబట్టి రేట్లు చాలా రీజనబుల్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లాన్ అంటే ఇదేనేమో
This post was last modified on April 21, 2023 5:03 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…