ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ మీద హైప్ మాములుగా లేదు. హీరోగా ఒకపక్కా బిజీగా ఉంటూనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న చరణ్ మనసులో ఇంకో కొత్త బిజినెస్ ప్లాన్ మనసులో ఉందట. అదే ఐపీఎల్ ఎంట్రీ. అయితే ఆటగాడిగా కాదండోయ్. ఫ్రాంచైజ్ ఓనర్ గా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ప్రతినిథిగా కేవలం సన్ రైజర్స్ మాత్రమే ఉంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా అభిమానులు భావించి దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి నగరానికి చోటు లేకపోవడంతో నిర్వాహకులు ఆ దిశగా ఆలోచించి వచ్చే ఏడాది 2024లో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో వైజాగ్ పేరుతో ఒక ఫ్రాంచైజ్ ని లాంచ్ చేసే ప్రతిపాదనలో ఉన్నారట. దాన్ని సొంతం చేసుకోవడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. భార్య ఉపాసనతో కలిసి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని టీమ్స్ ని షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా లాంటి వాళ్ళు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరూ ఈ దిశగా ఆలోచించలేదు కాబట్టి చరణ్ మొదటివాడు కావొచ్చట.
అఫీషియల్ గా తెలియడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ మొత్తానికి మంచి ఐడియానే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వస్తే తప్ప శంకర్ ఏ నిర్ణయం తీసుకోలేడు. సంక్రాంతికి వచ్చే ఛాన్స్ తగ్గిపోతున్న కారణంలో 2024 వేసవి తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఫ్రెష్ గా వచ్చిన ఈ ఐపీఎల్ వార్త నిజమైతే మాత్రం ఇంకో ఇంటరెస్టింగ్ టీమ్ తోడైనట్టే.
This post was last modified on April 20, 2023 12:42 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…