Movie News

హృతిక్ తండ్రి మామూలోడు కాదు

త‌న కొడుకు హృతిక్ రోష‌న్.. క‌హోనా ప్యార్ హై అనే ఒకే ఒక్క సినిమాతో సూప‌ర్ స్టార్‌ను చేసేసిన ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్. హృతిక్ టాలెంట్, అత‌డి అందం ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అయి అత‌ను స్టార్‌గా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ.. అత‌డికి అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన ఘ‌న‌త రాకేష్‌దే. ఆ త‌ర్వాత కూడా కొడుకుతో కోయీ మిల్ గ‌యా, క్రిష్‌, క్రిష్‌-3 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చాడు రాకేష్.

ఇండియాలో ఫ్రాంఛైజీ చిత్రాల ఒర‌వ‌డి పెర‌గ‌డంలో క్రిష్ సిరీస్‌ది చాలా కీల‌క పాత్ర‌. ఇండియాకంటూ చెప్పుకోవ‌డానికి సూప‌ర్ హీరో ఫ్రాంఛైజీ ఇదే. ఐతే క్రిష్‌-3 వ‌చ్చి ప‌దేళ్లు అవుతున్నా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా రాలేదు. నాలుగైదేళ్ల ముందే దీని కోసం ప్లానింగ్ జ‌రిగింది కానీ.. హృతిక్ కుటుంబానికి అనుకోని క‌ష్టం రావ‌డంతో సినిమా వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు.

రాకేష్ రోష‌న్ కొన్నేళ్ల కింద‌ట క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టంతో క్రిష్-4 ప‌ని ఆగిపోయింది. క్యాన్స‌ర్ లాంటి మ‌హ‌మ్మారి నుంచి కోలుకుని మామూలుగా బ‌త‌క‌డ‌మే క‌ష్టం. ఇక సినిమా తీయ‌డం, అందులోనూ క్రిష్-4 లాంటి మెగా మూవీ తీయ‌డం అంటే మాట‌లు కాదు. దీంతో ఈ సినిమా, ఈ ఫ్రాంఛైజీ ఇక ఉండ‌ద‌ని చాలామంది అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే చాన్నాళ్లుగా దీని గురించి సౌండ్ లేదు. కాగా ఇటీవ‌ల క్రిష్‌-4 సినిమా ఉంటుంద‌ని, కానీ ద‌ర్శ‌కుడు వేర‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసి.. ఇటీవ‌లే వార్-2 సినిమాను అనౌన్స్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఐతే హృతిక్ తండ్రి స్వ‌యంగా ఈ వార్త‌ల‌ను ఖండించాడు. ఇలాంటి ప్ర‌తిపాద‌నే లేద‌ని తేల్చేశాడు. త‌నే క్రిష్‌-4 సినిమా తీస్తాన‌ని.. స్క్రిప్టు అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాను ప్ర‌క‌టిస్తాన‌ని పేర్కొన్నాడు. వ‌య‌సు మీద ప‌డి, తీవ్ర అనారోగ్యం బారిన ప‌డ్డాక కూడా ఇంత పెద్ద సినిమా చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నాడంటే రాకేష్ మామూలోడు కాదు.

This post was last modified on April 19, 2023 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

9 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

56 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

56 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

5 hours ago