ఒకప్పుడు తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల రెఫరెన్సులు సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో పరిశీలిస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల రెఫరెన్సులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పవన్ పేరు వినిపించినా.. ఆయన మేనరిజంలను ఎవరైనా అనుకరించినా థియేటర్లు హోరెత్తిపోతుంటాయి. సినిమాల్లో అనే కాక టీవీ షోలు, సోషల్ మీడియాలో పేరున్న వ్యక్తులు, సంస్థల హ్యాండిల్స్‌లో సైతం పవన్‌ను బాగా వాడేస్తుంటారు. ఇప్పుడు క్రికెట్లోకి కూడా పవన్ ఫీవర్ వచ్చేసింది.
తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా పవన్‌ను వాడేసింది. ఒక ట్రెండీ ట్వీట్‌తో పవర్ స్టార్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తమ జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ ఆరెంజ్ కలర్ రుమాలు ధరించిన సందర్భంగా.. ఆ ఫొటో పెట్టి పవన్ తన మార్కును ఎర్ర టవల్ వేసుకున్న ఫొటోను జోడించి.. ‘‘ఫైర్ స్టార్మ్ ఈజీ్ కమింగ్’ అని వ్యాఖ్యను కూడా జోడించింది.
మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స్‌తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ వేసింది సన్‌రైజర్స్. పవన్ సరిగ్గా ఈ రోజే.. సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భ:గా ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి మొదట్నుంచి ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్యాగ్‌ను వాడుకుని.. పవన్‌తో మార్‌క్రమ్‌కు పోలిక పెడుతూ ట్వీట్ వేయడం తెలివైన ఎత్తుగడే. చెన్నై, బెంగళూరు, ముంబయి లాంటి జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్‌కు లోకల్ కనెక్షన్ పెద్దగా ఉండదని.. స్థానిక అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేయదని విమర్శలు ఉన్నాయి. ఐతే ఈ సీజన్లో మళ్లీ అభిమానులను ఎంగేజ్ చేయడానికి సన్‌రైజర్స్ యాజమాన్యం కొంచెం ఎఫర్ట్ పెడుతోంది. ఈ క్రమంలోనే ఇలాంటి తెలుగు టచ్ ఉన్న ట్వీట్లు వేస్తోంది.
This post was last modified on April 18, 2023 5:55 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…