గోపీచంద్ హ్యాండ్ ఇచ్చేసాడు!

సీటిమార్ షూటింగ్ ఇలాంటి క్లిష్ట సమయంలో మొదలు పెట్టే ఆలోచనలో గోపీచంద్ లేడని వార్తలొస్తే… షూటింగ్ ఆగష్టులో మొదలు పెట్టేస్తున్నామంటూ ప్రెస్ నోట్ పంపించారు. ఫిజికల్ డిస్టెన్స్ సాధ్యపడని కబడ్డీ నేపథ్యం ఉన్న ఈ చిత్రానికి ఇంకా కబడ్డీ ఆటకు సంబంధించిన సన్నివేశాలే చిత్రీకరించాల్సి ఉంది. దాంతో కరోనా విజృంభిస్తున్న టైంలో షూటింగ్ మొదలు పెట్టడం అసాధ్యమని మీడియా రిపోర్ట్ చేస్తే మొదలైపోతుంది అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు.

తీరా ఇప్పుడు షూటింగ్ కి హాజరు కాలేనని గోపీచంద్ తేల్చి చెప్పేశాడట. తనకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కనుక ఇలాంటి వేళ ఎవరి ఆరోగ్యాన్నీ రిస్క్ లో పెట్టలేనని, అందరూ షూటింగ్స్ మొదలు పెట్టే వరకు వేచి చూద్దామని చెప్పాడట. గోపీచంద్ షూటింగ్ కి వస్తే మిగతా భాగం పూర్తి చేసేసి థియేటర్లు తెరిచీ తెరవగానే ఈ సినిమా విడుదల చేసేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది కూడా సంక్రాంతి రిలీజ్ హోప్స్ తో ఉండాల్సిందే.