పేరుకు కోలీవుడ్ హీరో అనే మాటే కానీ చియాన్ విక్రమ్ కు అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దురదృష్టవశాత్తు ఎంత కష్టపడినా ఆ స్థాయిలో సక్సెస్ లేక వెనుకాడబడుతున్నాడు కానీ ప్రయాగాలు చేయడంలో కమల్ హాసన్ ని మించిపోయాడని ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఐ సమయంలో ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టి మరీ వేసిన కురూపి గూని వేషం ఎప్పటికీ మర్చిపోలేం. అపరిచితుడు లాంటివి ఇప్పటికీ గ్రేట్ క్లాసిక్స్ అనిపిస్తున్నాయంటే శంకర్ టేకింగ్ కన్నా విక్రమ్ నటన గొప్పగా అనిపించడం వల్లే. తాజాగా మరో టెర్రిఫిక్ రోల్ తో వస్తున్నాడు విక్రమ్.
తంగలాన్ పేరుతో రూపొందుతున్న పీరియాడిక్ కం హిస్టారిక్ డ్రామాలో భీతిగొలిపే వేషధారణతో ఇలాంటివి విక్రమ్ కు మాత్రమే సాధ్యమనేలా అదరగొట్టాడు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యూనిట్ మేకింగ్ వీడియోతో కలిపి చిన్న టీజర్ ని విడుదల చేసింది. అందులో విక్రమ్ అర్ధనగ్నంగా వయసు మళ్ళిన పాత్రలో సగం జుత్తు రాలిపోయి మొహమంతా కమిలిపోయి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అడవులు, కొండలు, కోనలు, రాతి యుగం మనుషులు ఇలా వాతావరణం చాలా అరుదుగా చూసేలా అనిపిస్తోంది. ఆది పినిశెట్టి ఏకవీర ఛాయలైతే కనిపించాయి.
తంగలాన్ దర్శకుడు పా రంజిత్. వెనుకబడిన వర్గాల భావజాలాన్ని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేసే ఈ విలక్షణ దర్శకుడు ఈ సారి ఎవరూ ఊహించని బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. తమిళ జనాలకు ఇవి బాగా కనెక్ట్ అవుతాయి కాని ఎటొచ్చి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే సవాల్ గా మారుతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని తెలుగులో యువి సంస్థ అందిస్తోంది. సూర్య కంగువ దారిలోనే దీనికి కూడా తెలుగు టైటిల్ తంగలాన్ అని యధాతథంగా పెట్టేశారు. రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఏడాది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on April 17, 2023 11:09 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…