పవన్ నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ దర్శకత్వం

వివిధ దశల్లో నాలుగు సినిమాలు సెట్లలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల తాలూకు ప్రకటనలు ఒకరకంగా అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వినోదయ సితం రీమేక్ పూర్తయ్యింది. ఓజిని ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. హరిహర వీరమల్లు బ్యాలన్స్ ఈ నెలలోనే మొదలవుతుంది. ఇవన్నీ రిలీజ్ అయ్యేలోగా ఎలాగూ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి పవన్ జనసేనలో బిజీ అయిపోతారని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. కానీ పిక్చర్ అభీ బాకీహై తరహాలో ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది.

అసలు ఫామ్ లో లేని సుధీర్ వర్మ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ ఖరారు చేశారనే వార్త బలంగా తిరుగుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయట. అయితే సుధీర్ వర్మ హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నాడు. రణరంగం, శాకినీ డాకిని, రావణాసుర వరసగా దెబ్బ కొట్టాయి. అయినా సరే పవన్ ఎస్ చెప్పడానికి కారణం త్రివిక్రమేనని ఇన్ సైడ్ టాక్. కథ స్క్రీన్ ప్లే మాటలు తాను సమకూరుస్తాననే మాట మీద ఇది పట్టాలు ఎక్కేందుకు రూట్ క్లియర్ అయ్యిందట. సుధీర్ వర్మ టేకింగ్ పరంగా కంప్లయింట్స్ లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట.

అన్నీ ఆలోచించే టైం లేదు కాబట్టే పవన్ ఆ బాధ్యత మొత్తం త్రివిక్రమ్ మీద పెట్టినందు వల్లే ఇలా ఒక్కొక్కటి సెట్ అవుతున్నాయని మెగా కాంపౌండ్ న్యూస్. ఈ లెక్కల 2024 వేసవిలోగా పవన్ కళ్యాణ్ సినిమాలు మొత్తం అయిదు విడుదలైనా ఆశ్చర్యం లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే సుధీర్ వర్మ సినిమాలో ఓ యూత్ హీరోకి స్కోప్ ఉందని అది వైష్ణవ్ తేజ్ తో చేయించే ఆలోచన ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి కాంబోలు గట్రా పర్ఫెక్ట్ గానే సెట్ అవుతున్నాయి కానీ పవన్ ఇప్పుడు రాజకీయాల కంటే సినిమాల గురించే సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.