Movie News

ఎన్టీఆర్ పార్టీ ఎందుకు ఇచ్చినట్టు

నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కి ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇదేదో సినిమా ఒప్పందమో లేక బిజినెస్ కోసమో కాదట. అతను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ప్రణాళికలో భాగంగా ఆ కలయిక ఇప్పటికి కుదిరిందన్న మాట. అయితే ఈ డిన్నర్ ని కేవలం అతనికే పరిమితం చేయకుండా తారక్ ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన వాళ్ళను పిలిపించుకుని ఇందులో భాగం చేయడం, ఆ ఫోటోలు ట్విట్టర్ ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం జరిగిపోయాయి.

ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఇద్దరి ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యాక సరిగా మాటలు లేవనే ప్రచారానికి చెక్ పెడుతూ మంచి పనే చేశారు. రాజమౌళి, మైత్రి రవిశంకర్ – నవీన్, కొరటాల శివ, శిరీష్, శోభు యార్లగడ్డ, కార్తికేయ తదితరులు హాజరయ్యారు. దిల్ రాజు, సుకుమార్ తదితరులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి కానీ షూటింగులు, హైదరాబాద్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల రాలేకపోయారు. కొందరు ఫోటో సెషన్ కంటే ముందే వెళ్లిపోవడం వల్ల పేర్లు మిస్ అయ్యాయి. మొత్తానికి ప్రైవేట్ పార్టీ ఇంతగా హైలైట్ కావడం అనూహ్యం.

ఇటీవలే ఎన్టీఆర్ 30 మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తారక్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. తిరిగి ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొనసాగించబోతున్నారు. షూటింగ్ తాలూకు ఫోటోలు లీకవుతున్నందుకు టీమ్ జాగ్రత్త పడుతోంది. అయితే తన లుక్ కు సంబంధించి జూనియర్ ఎలాంటి దాపరికం ఉంచడం లేదు. సినిమాలో కనిపించే తీరులోనే బయట తిరుగుతున్నాడు. ఇంతకీ జేమ్స్ ఫారెల్ బృందంతో సమావేశం వెనుక ఏదైనా మతలబు ఉందా అనే కోణంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి కానీ అమెజాన్ ప్లానింగ్ ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటుంది.

This post was last modified on April 13, 2023 10:35 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago