టాలీవుడ్ స్టార్ హీరోల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న వాళ్లలో అల్లు అర్జున్ ఒకడు. గత కొన్నేళ్లలో అతను ఇంతింతై అన్నట్లుగా ఎలా ఎదిగాడో తెలిసిందే. తండ్రి అల్లు అరవింద్ అనుభవం, ఆయన సలహాలు, అభిరుచి కూడా తోడవడం వల్లో ఏమో.. బన్నీకి భలే కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. కథల విషయంలోనూ అతను చాలా జాగ్రత్తగా ఉంటుంటాడు.
కొత్త దర్శకుడు వక్కంతం వంశీని నమ్మి ‘నా పేరు సూర్య’తో ఓ ప్రయోగం చేసి చూశాడు బన్నీ. అది తేడా కొట్టింది. అయినా కుంగిపోకుండా.. ఈసారి జాగ్రత్తగా ఆచితూచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి తనకు బాగా నప్పే కథతో ‘అల వైకుంఠపురములో’ చేశాడు.
బాక్సాఫీస్ బద్దలైపోయే విజయం దక్కింది. దీని తర్వాత బన్నీ మరింత అలెర్టయ్యాడు. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేసి భారీ విజయాన్నందుకున్నాక దానికి ఏమాత్రం తగ్గని రీతిలో ‘రంగస్థలం’తో మెగా హిట్ కొట్టిన సుకుమార్‌తో చిత్రాన్ని లైన్లో పెట్టాడు.
వీళ్ల కలయిక అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఇప్పుడు ఈ ఇద్దరూ ఎవరికి వాళ్లు ఇండస్ట్రీ హిట్ కొట్టాక జత కడుతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత బన్నీ లైన్లో పెట్టింది కూడా క్రేజీ ప్రాజెక్టే. కొరటాల శివతో బన్నీ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కొరటాల చేసిన నాలుగు సినిమాలూ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు మెగాస్టార్‌తో ‘ఆచార్య’ చేస్తున్నాడు. దాని తర్వాత బన్నీతో కొరటాల సినిమా అనేసరికి అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అన్నీ కలిసొస్తే పుష్ప, ఆచార్య కూడా రికార్డ్ బ్రేకింగ్ హిట్లు కావచ్చేమో.
ఆ తర్వాత బన్నీ, కొరటాల కలిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది. ఇలా వరుసగా బన్నీ టాలీవుడ్ టాప్-4 దర్శకుల్లో ముగ్గురితో సినిమాలు లైన్లో పెట్టడం విశేషమే. ఇక నంబర్ వన్ డైరెక్ట్రర్ రాజమౌళితో కూడా ఓ సినిమా చేసేస్తే ఇక అతడికి తిరుగులేనట్లే.
This post was last modified on August 2, 2020 6:59 pm
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…