భయపడినట్టే అవుతోంది. ఐపీఎల్ ప్రభావం బాక్సాఫీస్ మీద గట్టిగానే పడుతోంది. ముఖ్యంగా సాయంత్రం జరిగే మ్యాచులు చూడటం కోసం జనం ఇళ్లలోనే కదలకుండా ఉండటంతో థియేటర్ల టికెట్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. అందులోనూ రోజూ జరుగుతున్న ఆటల్లో ట్విస్టులు, క్లైమాక్సులు, ఫలితాలు ఊహాతీతంగా వస్తున్నాయి. తాము ఏ టీమ్ కి మద్దతు ఇస్తున్నామనే కోణంలో కాకుండా ఏ ఎంజాయ్ మెంట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రతిదీ చూసేందుకు క్రికెట్ లవర్స్ ప్రిపేర్ అవుతున్నారు. దసరాకు కాదు కానీ దీని డ్యామేజ్ మీటర్, రావణాసురల మీద తీవ్రంగా పడింది.
అసలే ఫ్లాప్ టాక్ తో సతమతమవుతున్న టైంలో ఐపిఎల్ రూపంలో పడిన దెబ్బకు అల్లాడిపోతున్నాయి. అలా అని మార్నింగ్ మ్యాటీలు బాగున్నాయని కాదు. ఎండల తాకిడికి పగటి వేళ హాలుకు వచ్చేందుకు పబ్లిక్ అంత సుముఖంగా లేరు. దసరాలాగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వేడిని తట్టుకుని మరీ వెళ్తున్నారు కానీ సోసోగా ఉన్నాయంటే మాత్రం ఓటిటిలో చూద్దాం లెమ్మని లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆక్యుపెన్సీలు అంతంత మాత్రంగా ఉండి షోలు క్యాన్సిల్ చేసే దాకా పరిస్థితి వెళ్తోంది. ఇంకా ఐపీఎల్ సీజన్ నలభై రోజుల పైగానే ఉంది. సో పూర్తి ముప్పు తొలగలేదు.
వచ్చే నెల కూడా భారీ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్యాన్ ఇండియా సినిమాలు పెద్దగా లేవు. నాగ చైతన్య కస్టడీ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుండగా అల్లరి నరేష్, గోపీచంద్ లాంటి స్ట్రగులింగ్ హీరోలు తమ అదృష్టాన్ని మేలోనే పరీక్షించుకోబోతున్నారు. ఈ నెలాఖరున ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 లు సైతం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఎలాగైనా సరే థియేటర్లోనే చూడాలన్న రిపోర్ట్స్ ని రాబట్టుకోవాలి. అప్పుడే వాటి మీద పెట్టిన పెట్టుబడికి తగట్టు ఓపెనింగ్స్, లాంగ్ రన్ దక్కుతాయి. ఐపీఎల్ ప్రతి సినిమా ప్రేమికుడు చూస్తున్నారని కాదు కానీ క్రికెట్ లవర్స్ అందరూ మూవీ లవర్సే అయ్యుంటారుగా
This post was last modified on April 11, 2023 8:38 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…