ఇంకా ఎనిమిది నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ 2024 సంక్రాంతి మీద నువ్వా నేనా అంటూ హీరోలు నిర్మాతలు పోటీపడి మరీ కర్చీఫ్ లు వేస్తున్నారు. ప్రాజెక్ట్ కె జనవరి 12న రావడం గురించి ఉన్న అనుమానాలకు తెరదించుతూ ఇవాళ విడుదల చేసిన మేకింగ్ వీడియోతో పాటు ఇచ్చిన ప్రెస్ నోట్ లో వైజయంతి సంస్థ మరోసారి డేట్ మారదని నొక్కి వక్కాణించింది. మహేష్ బాబు 28 ఎపుడో 13వ తేదీని తీసుకుంది కాబట్టి దానికీ టెన్షన్ లేదు. మొన్నీమధ్యే ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ వీలైతే ఉస్తాద్ భగత్ సింగ్ ని పండగ బరిలోనే దింపుతామని సంకేతం ఇచ్చారు.
కమల్ హాసన్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 పొంగల్ కి రావడం దాదాపు కన్ఫర్మ్. ఈ కారణంగానే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని వేసవికి షిఫ్ట్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు అందుకే ఏదీ ఖచ్చితంగా చెప్పడం లేదు. ఇక్కడితో నాలుగయ్యాయి. తాజాగా సూర్య కూడా ఈ రేసులో చేరబోతున్నట్టు చెన్నై టాక్. సిరుతై శివ దర్శకుడిగా పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంక్రాంతి కంటే మంచి సీజన్ ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు. అజిత్, విజయ్ లు లేరు కాబట్టి ఆ ఛాన్స్ వాడుకోవడానికట.
ఇప్పుడిది కూడా ఖరారైతే మొత్తం కౌంట్ అయిదుకు చేరుతుంది. అందరూ స్టార్ హీరోలే. కనీసం ఒక్కోదాని మీద వంద నుంచి మూడు వందల కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. మొత్తం కలిపితే అటుఇటుగా వెయ్యి కోట్ల దాకా ఉంటుంది. అదే జరిగితే అంతకు రెట్టింపు మొత్తం షేర్ రూపంలో రావాలి. బ్లాక్ బస్టర్ అయితేనే ఈ ఫిగర్లు సాధ్యమవుతాయి. ఏదైనా ఒకటి రెండు డిజాస్టరైనా అంతే సంగతులు. అందరూ ఒకటే సీజన్ కావాలనుకోవడం వల్లే ఈ సమస్య వస్తోంది. మొన్న చిరు బాలయ్యలతో గడిచిపోయింది కానీ వచ్చే ఏడాది మాత్రం నెవర్ బిఫోర్ వార్ లా మారనుంది.
This post was last modified on April 10, 2023 5:21 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…