ఇంకో పద్దెనిమి రోజుల్లో ఏజెంట్ చూడబోతున్నామని అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు కానీ ఆ టీమ్ మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను ఆఘమేఘాల మీద చిత్రీకరిస్తున్నారు. వీటిలో ఒకటి ఐటెం సాంగ్. వాల్తేరు వీరయ్యలో చేసిన ఊర్వశి రౌతేలా కాంబినేషన్ లో షూట్ చేస్తారు. రెండోది హీరోయిన్ సాక్షి వైద్యతో ఉంటుంది. వీటికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ లో జరుగుతున్నాయి. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు నాగార్జున సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ ఏదీ ఉండట్లేదు.
చేతిలో చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా సెన్సార్ కు వెళ్ళాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపుగా కొలిక్కి తెచ్చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇలా టార్గెట్ పెట్టుకుని ఒత్తిడి కొనితెచ్చుకోవడం ఇష్టం లేకపోయినా నిర్మాత అనిల్ సుంకర మాత్రం వెనక్కు తగ్గేది వద్దని చెప్పడం వల్లే ప్రెజర్ ని తీసుకున్నారని వినికిడి. ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. సుమతో ఇంటర్వ్యూ తప్ప ఏదీ బయటికి రాలేదు. ఇంకా టీమ్ సభ్యులు, డైరెక్టర్, సాంకేతిక వర్గం తదితరులు మీడియా ముందుకు రావాల్సి ఉంది. బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి.
అదే రోజు పొన్నియన్ సెల్వన్ 2 ఉన్నప్పటికి ఏజెంట్ దాని విషయంలో టెన్షన్ లేదు. కానీ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నాని, సమంతా లాగా అఖిల్ దేశం మొత్తం ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. ట్రైలర్ లాంచ్ ఈ నెల 17 లేదా 18న కాకినాడలో చేసే ప్రతిపాదనని పరిశీలిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా మార్చిలోనే పూర్తి కావాల్సిన ఏజెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల లేట్ అయ్యిందనే కామెంట్స్ ఉన్నాయి కానీ అఖిల్ తానుగా చెబితే తప్ప క్లారిటీ రాదు. హిప్ హాప్ తమిజా పాటలకు స్పందన బాగానే ఉంది