ఖైదీ దర్శకుడి ప్రపంచంలో రజినీకాంత్

ఖైదీ, విక్రమ్ లతో తన టెక్నికల్ బ్రిలియన్స్ తెరమీద అద్భుతంగా ఆవిష్కరించిన లోకేష్ కనగరాజ్ గత కొన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కమల్ హాసన్ కు మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఇప్పట్లో మర్చిపోయే సెన్సేషన్ కాదు. ప్రస్తుతం అతను విజయ్ తో చేస్తున్న లియో మీద విపరీతమైన హైప్ నెలకొంది. కేవలం ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులే 60 కోట్లకు అమ్ముడుపోవడం గురించి చెన్నై మీడియా ఘనంగా చెప్పుకుంటోంది. ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామాతో ఈ స్థాయి బిజినెస్ చేయడం ఒక్క లోకేష్ బ్రాండ్ వల్లే సాధ్యమయ్యిందనేది విశ్లేషకుల మాట

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ జట్టుకట్టొచ్చనే వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవలే కథకు సంబంధించిన ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయని నెరేషన్ పట్ల బాగా ఇంప్రెస్ అయిన తలైవా వెంటనే అంగీకారం తెలిపారట. లియోని లోకేష్ ఈ ఆగస్ట్ లోగా పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. లైనప్ లో విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2లు ఉన్నాయి. వీటిని కలిపి ఒక యునివర్స్ లాగా చేయాలా లేక విడివిడిగా తీయాలా అనే దాని మీద ఇంకా కంక్లూజన్ కి రాలేదట. సూర్యతో కేవలం నూటా యాభై రోజుల్లో సినిమా తీస్తానని లోకేష్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే

ఇక రజినీకాంత్ విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్న జైలర్ షూటింగ్ ముప్పాతిక శాతం పూర్తయ్యింది. ఆగస్ట్ 11 విడుదలని టార్గెట్ గా పెట్టుకుని నెల్సన్ దిలీప్ కుమార్ బృందం డే అండ్ నైట్ పని చేస్తోంది. ఇది అయ్యాక లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తీస్తున్న మరో సినిమాలో స్పెషల్ క్యామియో చేస్తున్న రజని కొంత విశ్రాంతి తీసుకున్నాకే కొత్త ప్రాజెక్టు మొదలుపెడతారు. చూస్తుంటే జేమ్స్ బాండ్ సిరీస్ లాగా లోకేష్ మల్టీవర్స్ ని కొనసాగించేలా ఉన్నాడు