ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. గతంలో కొన్ని ప్రేమాయణాల్లో దెబ్బ తిన్న ఆమె.. చివరికి దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి అతణ్ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత ఏడాదే వీళ్లిద్దరూ తల్లిదండ్రులుగా మారారు కూడా. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ జంట. సరోగసీ ద్వారా నయన్, విఘ్నేష్ ఈ బిడ్డల్ని కనడం మీద పెద్ద చర్చే జరిగింది కొన్ని రోజుల పాటు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పటిదాకా తన పిల్లల ఫొటోలేవీ బయటికి రాకుండా చూసుకున్న నయన్.. తాజాగా వారి పేర్లను మాత్రం బయటపెట్టింది.
ఇద్దరు అబ్బాయిల పేర్ల వెనుక తల్లిదండ్రుల పేర్లు వచ్చేలా చూసుకున్న ఆమె.. తమిళంలో ఆసక్తికరమైన పేర్లనే పెట్టుకుంది. అందులో ఒకరి పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ కాగా కాగా.. మరొకరి పేరు ఉలగ్ దైవేగ్ ఎన్ శివన్.
తమిళంలో ఉయిర్ అంటే ప్రాణం అని అర్థం. ఉలగ్ అనేది ఉలగం అనే మాట నుంచి వచ్చింది. ఉలగం అంటే ప్రపంచం అని అర్థం. తన ఇద్దరు బిడ్డల్లో ఒకరేమో తమ ప్రాణం అయితే.. ఇంకొకరు తమ ప్రపంచం అని నయన్ చెప్పకనే చెబుతోంది. ఇలాంటి పేర్లు అరుదుగానే ఉంటాయి. నయన్, శివన్ తమ పిల్లలకు భలే పేర్లు పెట్టారంటూ సోషల్ మీడియా జనాలు కొనియాడుతున్నారు.
నయన్‌కు గర్భం ధరించడానికి సమస్య లేకపోయినా, సినిమాల్లో కొనసాగుతున్నందు వల్ల ఏమాత్రం కష్టపడకుండా, అందం దెబ్బ తినకుండా ఉండేందుకే సరోగసీ ద్వారా పిల్లల్ని కనిందని, ఈ విషయంలో నిబంధనలు కూడా పాటించలేదని ఆమెపై విమర్శలు వచ్చాయి. సరోగసీ విషయంలో ఏవో న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అంతా సద్దుమణిగింది. ప్రస్తుతం నయన్ తమిళంలో మూణ్నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates