మాములుగా ఒక స్టార్ హీరో ఇమేజ్ మీద ఓపెనింగ్స్ రావడం చూశాం కానీ ఒక డైరెక్టర్ బ్రాండ్ మీద క్రేజ్ రావడమనేది కొందరికే జరుగుతుంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి లాంటివాళ్ళను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్లంతా కమర్షియల్ దర్శకులు. కానీ సహజత్వానికి పెద్ద పీఠ వేస్తూ రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తాడని పేరున్న వెట్రిమారన్ ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్.
నిన్న ‘విడుతలై పార్ట్ 1’ భారీ అంచనాల మధ్య తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. ప్రీమియర్స్ నుంచే ప్రశంసల వర్షం కురుస్తోంది. కమెడియన్ సూరి కథానాయకుడిగా రూపొందిన ఈ ఇంటెన్స్ డ్రామాలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించారు. పీరియాడిక్ డ్రామాగా ఇది సాగుతుంది. పోలీస్ వ్యవస్థలో పాతుకుపోయిన అహంకార జాడ్యం, టెర్రరిస్టులు నక్సలైట్లను ఎదిరించే క్రమంలో వీళ్ళు చేసిన దురాగతాలు అన్నీ కూలంకుషంగా ఇందుకు చూపించే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్.
సున్నిత మనస్కులు, చిన్న పిల్లలను దూరంగా ఉండమని రివ్యూయర్లు పేర్కొంటున్నారంటేనే హింస మోతాదు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఇళయరాజా సంగీతం, నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక వర్గం పనితనం విడుతలైని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి.
అణుగారిన వర్గాల ఘోషను వినిపించే వెట్రిమారన్ ఇందులోనూ అదే చేశారు. సూరి విజయ్ సేతుపతిల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిదెబ్బకు శింబు పాతుతల వసూళ్లు దెబ్బ తింటున్నాయని ట్రేడ్ వాపోతోంది. తెలుగు డబ్బింగ్ చేసి ఏప్రిల్ 7 విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు చెన్నై టాక్. వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే మన ఆడియన్స్ కూ ఒక గొప్ప అనుభూతి దక్కుతుంది. వడ చెన్నై, అసురన్ స్ట్రెయిట్ వెర్షన్లు ఎలాగూ మిస్ అయ్యాయి. ఇదైనా చూడాలి.
This post was last modified on April 1, 2023 2:41 pm
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…