బాక్సాఫీస్ వద్ద ధరణి మాస్ ఊచకోత కొనసాగుతోంది. కేవలం రెండు రోజులకే 52 కోట్ల గ్రాస్ వసూలు కావడం చూసి నాని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షేర్ ఆల్రెడీ ముప్పై కోట్లకు దగ్గరగా వెళ్లిపోయింది. ఒకప్పుడు ఇది ఫుల్ రన్ లో రావడానికే కొన్ని నాని హిట్ సినిమాలు మూడు నాలుగు వారాలు తీసుకునేవి. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ ఊచకోత అంటే చిన్న విషయం కాదు.
వీకెండ్ ఇంకో రెండు రోజులు ఉంది కాబట్టి ఈ ర్యాంపేజ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏరియాల వారిగా దసరా రికార్డులు బయటికొస్తున్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుని వాడుకోవడం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అనుకుంటే రివర్స్ లో అదే పెద్ద ప్లస్ అయ్యింది. టాక్ వింటున్న పబ్లిక్ హైక్ ని పట్టించుకోకుండా టికెట్లు అడ్వాన్స్ గా కొనేస్తున్నారు. బరిలో ఇంకే పోటీ లేకపోవడం దసరాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది.
రెండో రోజు వసూళ్ల పరంగా ఏపీ తెలంగాణలో మీడియం రేంజ్ మూవీస్ లో ఇప్పటిదాకా ఉప్పెన 6 కోట్ల 80 లక్షలతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. దసరా ఓ ఎనభై లక్షల దాకా వెనుకబడి ఉన్నా ఫైనల్ లెక్కల్లో ఇంకొంత స్పష్టత రావాలని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న నేపథ్యంలో వేచి చూడాలి.
ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ మొదటి వారం గడవకుండానే జరిగిపోవడం ఖాయం. అటు హిందీలో దసరా పికప్ స్లోగా ఉంది. అజయ్ దేవగన్ భోళాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే నార్త్ ఆడియన్స్ నాని మూవీ గురించి తెలుసుకుని థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు. కర్ణాటకలో పర్వాలేదనిపించుకోగా తమిళనాడులో విడుతలై 1, పాతుతల కాంపిటీషన్ వల్ల అక్కడ దసరాకు ఇబ్బందులు తప్పలేదు. ఓవర్సీస్ లో నానిని ఇలాంటి కంటెంట్ తో ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకోవడం ఆశ్చర్యకరం. ఫైనల్ ఫిగర్స్ మాత్రం చాలా షాకింగ్ గా ఉండబోతున్నాయి
This post was last modified on April 1, 2023 12:47 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…