తెలుగులో సినిమాలకు షార్ట్ సీజన్లలో బెస్ట్ అంటే.. సంక్రాంతినే. వారం పది రోజుల పాటు ఆ టైంలో సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఇక ఎక్కువ రోజుల పాటు మంచి వసూళ్లతో సినిమాలకు కలిసొచ్చే సీజన్ అంటే వేసవినే. విద్యార్థులు అందరికీ ఈ టైంలో సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు పెద్ద ఎత్తున కదిలి వస్తాయి. అందుకే ఈ టైంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు మంచి వసళ్లు వస్తాయి.
అలాగే లాంగ్ రన్ కూడా ఉంటుంది. ప్రతి వేసవిలోనూ టాప్ స్టార్లు నటించిన కొన్ని భారీ చిత్రాలు రిలీజవడం మామూలే. కానీ ఈసారి మాత్రం చిత్రంగా అలాంటి సినిమా ఒక్కటీ లేదు. అలా అని వినోదానికేమీ ఢోకా లేదు. మిడ్ రేంజ్‌లో క్రేజీ సినిమాలు వేసవికి షెడ్యూల్ అయ్యాయి. అందులో తొలి సినిమా ‘దసరా’ నిన్ననే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే పెద్ద సినిమాలు లేవనే లోటే కనిపించేలా లేదు.
పెద్ద హీరోల సినిమాలకు దీటుగా ‘దసరా’కు ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కూడా భారీగానే చేశారు. గురువారం అంతా థియేటర్లు కళకళళాడిపోయాయి. శుక్రవారం కూడా సందడి కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో సైతం ‘దసరా’ ప్యాక్డ్ హౌస్‌లతో సందడి చేసేలా కనిపిస్తోంది. ‘దసరా’ ఊపు టాలీవుడ్‌లో హుషారు పుట్టిస్తోంది. వేసవికి రానున్న సినిమాలకు ఇది శుభ సంకేతమే.
ఈ ఉత్సాహంలో రవితేజ సినిమా ‘రావణాసుర’ టీం కూడా భారీ రిలీజ్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘ధమాకా’; ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ సక్సెస్‌ల తర్వాత మాస్ రాజా నుంచి రానున్న సినిమా కావడంతో ఆయన కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి అదనపు షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ పరంగా రవితేజ కెరీర్లో ఇది రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. దీని తర్వాత శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్, రామబాణం లాంటి క్రేజీ సినిమాలు వేసవిలో వరుసకట్టబోతున్నాయి.
This post was last modified on April 1, 2023 8:35 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…